Bandla Ganesh: ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇవన్నీ వేస్ట్.. బండ్ల గణేష్ కామెంట్స్!

టాలీవుడ్ లో ప్రొడక్షన్ కి సంబంధించిన కొన్ని సమస్యలు తలెత్తాయి. దీంతో ఇటీవల ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్స్ బంద్ చేస్తామంటూ హెచ్చరించింది. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా టికెట్ రేట్లు పెంచమని అడిగిన వాళ్లే.. ఇప్పుడు తగ్గించమని అడుగుతున్నారని అశ్వనీదత్ అన్నారు. గతంలో నిర్మాతల సమస్యల పరిష్కారానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటైందని.. అయితే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎందుకు ఏర్పాటయిందో తనకు అర్ధం కావడం లేదని అన్నారు.

హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం వలనే సినిమా టికెట్ రేట్లు పెంచారనే విషయంలో నిజం లేదని అన్నారు. అశ్వనీదత్ చేసిన ఈ కామెంట్స్ పై బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. అశ్వనీదత్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. అశ్వనీదత్ యాభై ఏళ్లుగా సినిమా నిర్మాణ రంగంలో ఉన్నారని బండ్ల గణేష్ చెప్పారు. ఏ హీరోను, డైరెక్టర్ ను రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పే అర్హత నిర్మాతలకు లేదని అన్నారు. కార్లలో రకరకాలు ఉంటాయని..

అన్నీ కార్లే అయినా ఒక్కో కారుకి ఒక్కో రేటు ఉన్నట్లే.. అందరూ హీరోలే అయినా.. ఒక్కో హీరోకి ఒక రేటు ఉంటుందని చెప్పారు. ఎవరి రేంజ్ వాళ్లకు ఉంటుందని.. మనకు నచ్చి, మనం ఎంత మార్కెట్ చేసుకోవాలో తెలిసినప్పుడు హీరోని అప్రోచ్ అయి సినిమా తీయాలని అన్నారు. అంతేకానీ.. హీరోల రెమ్యునరేషన్ తగ్గించాలనేది తప్పు వాదనంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. కాల్ షీట్లకు.. షీట్లకు తేడా తెలియని వాళ్లు కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్నాంటూ..

వెటకారంగా మాట్లాడారు బండ్ల గణేష్. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇవన్నీ వేస్ట్ అని.. ఒక ఛాంబర్, కౌన్సిల్ ఉండాలని దానికి ఎప్పుడు కట్టుబడి ఉండాలని అన్నారు. సినిమాలు తీయని వాళ్లు కూడా గిల్డ్ లో ఉన్నారని.. వాళ్లకి సినిమాల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు బండ్ల గణేష్.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus