‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ విడుదలయ్యింది. సినిమాకి కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.
కానీ ఆ తర్వాత మాత్రం చేతులెత్తేసింది. వేరే క్రేజీ సినిమాలు ఏమీ లేకపోవడంతో ‘బంగార్రాజు’ మాత్రమే జనాలకి ఆప్షన్ అయ్యింది. దాంతో కిందా మీదా పడి బ్రేక్ ఈవెన్ ను సాధించింది.5 వ వీకెండ్ పోటీగా సినిమాలు ఉన్నప్పటికీ కొన్ని ఏరియాల్లో ఓ మోస్తరుగా కలెక్ట్ చేసింది.
ఈ చిత్రం 30 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం | 8.51 cr |
సీడెడ్ | 7.81 cr |
ఉత్తరాంధ్ర | 5.25 cr |
ఈస్ట్ | 4.19 cr |
వెస్ట్ | 2.94 cr |
గుంటూరు | 3.61 cr |
కృష్ణా | 2.29 cr |
నెల్లూరు | 1.90 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 36.50 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.37 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 39.63 cr |
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 30 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.39.94 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుని హిట్ గా నిలిచింది కానీ … నైజాం, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో మాత్రం ఈ మూవీ నష్టాలనే మిగిల్చింది.
మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.0.94 కోట్ల వరకు లాభాలను అందించింది. ‘ఖిలాడి’ తో పాటు ‘సెహరి’ ‘ఎఫ్.ఐ.ఆర్’ ‘డిజె టిల్లు’ వంటి క్రేజీ సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ ఈ వీకెండ్ ఓ మోస్తారుగా కలెక్ట్ చేసింది.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!