‘కింగ్’ నాగార్జున,యువసామ్రాట్ నాగ చైతన్య హీరోలుగా రమ్య కృష్ణ, కృతి శెట్టి.. హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. ‘జీ స్టూడియోస్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కింది.జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ విడుదలయ్యింది.కాస్త రొటీన్ గా అనిపించినా మొత్తానికి బాగానే ఉంది అనే టాక్ ను ఈ చిత్రం రాబట్టుకుంది.
మొదటి వారం ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది.టికెట్ రేట్లు తక్కువగా ఉన్న ఆంధ్ర వంటి ఏరియాల్లో కూడా ఈ చిత్రం సాలిడ్ గా రాబట్టింది. అయితే నైజాంలో మాత్రం ఈ చిత్రం ఆశించిన మేర కలెక్ట్ చేయలేకపోతోంది. ఒకసారి 8 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
7.72 cr
సీడెడ్
6.76 cr
ఉత్తరాంధ్ర
4.36 cr
ఈస్ట్
3.62 cr
వెస్ట్
2.60 cr
గుంటూరు
3.06 cr
కృష్ణా
1.98 cr
నెల్లూరు
1.69 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
31.79 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
3.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
34.79 cr
‘బంగార్రాజు’ చిత్రానికి రూ.38.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.34.79 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.4.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిన్న రెండో శుక్రవారం నాడు కూడా ఈ చిత్రం 0.47 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది.
చెప్పాలంటే ఇవి మంచి కలెక్షన్లే..! కాకపోతే ఇలా పెర్ఫార్మ్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. గత 3 రోజులుగా అయితే ఈ చిత్రం నైజాం పెర్ఫార్మన్స్ చాలా ఘోరంగా ఉంది. కోవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా అనుకుంట ‘బంగార్రాజు’ … ‘సోగ్గాడే చిన్నినాయన’ రేంజ్ లో కలెక్ట్ చేయలేకపోతోంది.