Rj Surya, Arohi Rao: ఆర్జే సూర్య కి మసాజ్ చేసిన ఆరోహి..! అసలు జరిగింది ఏంటంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ప్రస్తుతం బిబి హోటల్ టాస్క్ అనేది నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ రకరకాలుగా విడిపోయారు. బిబి హోటల్ కి ఇంకా హోటల్ గ్లామ్ ప్యారడైజ్ కి మద్యలో పోటీ పెట్టాడు బిగ్ బాస్. అథితులని ఎట్రాక్ట్ చేయాలని, చివరకి ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఒకరితో ఒకరు డీల్ మాట్లాడుకున్నారు. ఇక్కడే ఆర్జే సూర్య హోటల్ లో ఒక మతిమరపు అథితిగా వచ్చాడు. గ్లామ్ ప్యారడైజ్ లో గర్ల్ గా ఆరోహి ఉంది.

ఆర్జే సూర్య అన్నీ మర్చిపోయే వ్యక్తిగా యాక్ట్ చేస్తూ లేడీ గెటప్ వేశాడు. అంతేకాదు, సింగిల్ పీస్ డ్రెస్ వేసుకుని వచ్చి మరీ ర్యాంప్ వాక్ చేశాడు. పోల్ డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయాడు. ఆర్జే సూర్య పెర్ఫామన్స్ కి హౌస్ మేట్స్ అందరూ ఫిదా అయిపోయారు. దీంతో మనోడు రెచ్చిపోయి మరీ ఫన్ చేశాడు. ఆ తర్వాత ఆర్జే సూర్యకి బ్యాంకాక్ స్టైల్ లో మసాజ్ చేసింది. బేర్ బాడీతో బోర్లా పడుకున్న సూర్యకి సింగిల్ పీస్ డ్రెస్ వేసుకున్న ఆరోహి మసాజ్ చేసింది. ఆర్జే సూర్య ఆరోహిల మద్యన ఉన్న కెమిస్ట్రీ వల్ల ఇది బాగా వర్కౌట్ అయ్యింది.

అంతేకాదు, హౌస్ లో ఫస్ట్ వీక్ నుంచీ కూడా ఇద్దరూ కలిసే గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఇద్దరూ ఫేవరెటిజం అనేది ఖచ్చితంగా టాస్క్ లో చూపిస్తారు. ఈటాస్క్ లో ఎవరికి వాళ్లే ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు వేరే హౌస్ మేట్స్ తో డీల్స్ కుదుర్చుకుంటున్నారు. ఈ డీల్ లో భాగంగానే ఆరోహి ఆర్జే సూర్యకి మసాజ్ చేసింది. ఆ తర్వాత ఆర్జే సూర్య తప్పిపోయిన పిల్లాడిలా కాసేపు ఫన్ చేశాడు.

మరోవైపు అథితులుగా వచ్చిన అర్జున్, శ్రీహాన్, రాజ్ ముగ్గురూ హౌస్ మేట్స్ తో కలిసి రెచ్చిపోయారు. ముఖ్యంగా గర్ల్స్ ఉన్న గ్లామ్ ప్యారడైజ్ హోటల్లో రాజ్ ఉండిపోయాడు. అర్జున్ శ్రీసత్య తో ఫోటోలు దిగినా, అన్నం తినిపించినా, ఆమ్లెట్ వేసి ఇచ్చినా టిప్స్ ఇస్తున్నాడు. శ్రీహాన్ హీరో గెస్ట్ గా ఫన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి బిబి హోటల్ టాస్క్ అనేది ఆడియన్స్ కి మంచి మజాని ఇస్తోంది. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus