Bappi Lahiri: ‘గొంతు’పై క్లారిటీ ఇచ్చిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌!

సాఫ్ట్‌ సంగీతం, అప్పుడప్పుడు మాస్‌ సంగీతం అలవాటుపడిన భారతీయ చిత్రపరిశ్రమకు సూపర్‌ ఫాస్ట్‌ సంగీతం, హైపర్‌ ఫాస్ట్‌ గొంతు పరిచేయం చేసిన సంగీత దర్శకుడు బప్పీలహరి. ఆయన మ్యూజిక్‌లో ఏదో మేజిక్‌ ఉంది అంటుంటారు. అంతే స్థాయిలో ఆయన గొంతులోనూ ఉంది. అలాంటి గొంతు పోయింది అంటూ … ఇటీవల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అయితే దీనిపై తాజాగా బప్పీలహరి స్పందించారు. అది కూడా మామూలుగా కాదు.‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్…’ అంటూ బప్పీలహరి పాడిన పాట గుర్తుందా.

ఆ గొంతు అలాంటిది మరి… ఆ బీట్‌ అలాంటిది మరి. ఇదే కాదు… ఇలాంటి ఎన్నో తనదైన శైలి పాటలతో ప్రేక్షకులను ఆయన ఎప్పుడూ అలరిస్తూనే ఉన్నారు. అయితే ఆయన గొంతులో ఏదో ఇబ్బంది వచ్చింది అంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి. కరోనా సోకడంతో అతని గొంతు పోగొట్టుకున్నారని ఆ వార్తల సారాంశం.ఈ వార్తలు వైరల్ కావడంతో బప్పీ తన గొంతుతోనే సమాధానం ఇచ్చారు. ఓ పాట పాడి… ఆ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

తాను బాగానే ఉన్నట్టు, తన ఆరోగ్యం, గొంతు బాగానే ఉన్నాయని తనదైన శైలిలో కన్ఫర్మ్ చేశారు బప్పీలహరి. కావాలంటే ఒకసారి మీరు కూడా ఆ పాట విని మైమరచిపోండి. ఇదిగో వీడియో.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)


‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus