మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రం “బరోజ్”. పోర్చుగల్ జానపద కథల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని టి.కె.రాజీవన్ నేతృత్వంలో మోహన్ లాల్ 3Dలో తెరకెక్కించడం విశేషం. మోహన్ లాల్ తాను హీరోగా పరిచయమైన డిసెంబర్ 25న, తన దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి చిత్రాన్ని విడుదల చేశారు. నటుడిగా శిఖరం లాంటి మోహన్ లాల్ దర్శకుడిగా ఏ స్థాయిలో ఆకట్టుకున్నారో చూద్దాం..!!
Barroz Review
కథ: పోర్చుగల్ సామ్రాజ్యం గోవా విడిచి పోవడానికి ముందు చోటు చేసుకున్న యుద్ధంలో ఆ దేశ సంపదను కాపాడేందుకు బరోజ్ (మోహన్ లాల్) అనే మాంత్రికుడ్ని కాపలా నియమిస్తారు. దాదాపు 400 ఏళ్లు ఆ నిధికి కాపలా కాసిన బరోజ్ కి డ గామా వంశపు 13వ తరం వారసురాలు ఇసాబెల్లా 2020లో పుట్టిందని, ఆమె గోవాకు వచ్చిందని గ్రహిస్తాడు బరోజ్.
ఆమెకు నిధిని అందజేసి తాను విముక్తి పొందాలి అనుకుంటాడు.
ఇసాబెల్లా ఈ విషయంలో బరోజ్ కి సహకరించిందా? ఇందుకు అడ్డంగా నిలిచింది ఎవరు? చివరికి బరోజ్ విముక్తి పొందాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే “బరోజ్” చిత్రం.
నటీనటుల పనితీరు: నటుడిగా మోహన్ లాల్ ఒక పాత్రను ఓన్ చేసుకునే తీరు, ఆ పాత్రను తెరపై ప్రెజెంట్ చేసే తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బరోజ్ అనే నిర్భంధించబడిన మాంత్రికుడిగా మోహన్ లాల్ తారాస్థాయి విధేయతను, బాధను తన కళ్ళతోనే పండించాడు.
ఇసాబెల్లాగా కీలకపాత్ర పోషించిన పాప చూడ్డానికి పోర్చుగల్ అమ్మాయిలా ఉన్నప్పటికీ.. హావభావాల ప్రకటన విషయంలో మాత్రం తేలిపోయింది. అందువల్ల ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవ్వాల్సిన ఈ క్యారెక్టర్ అస్సలు వర్కవుట్ అవ్వలేదు. ఈ పాప స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: జానపద కథలను సినిమాలుగా తెరకెక్కించాలనే ఆలోచన గొప్పది. నేటి తరానికి ఆ నీతి కథలు అనేవి అందుబాటులోకి లేకుండాపోతున్నాయి. అయితే.. ఆ కథలను ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చెబుతున్నామనేది చాలా ముఖ్యం. దర్శకుడిగా మోహన్ లాల్ అక్కడి తప్పటడుగు వేశాడు. ఎందుకంటే.. ఇదే తరహా నీతికథలతో వాల్ట్ డిస్నీ, పిక్సార్ వంటి సంస్థలు అత్యద్భుతమైన క్వాలిటీ కంటెంట్ అందిస్తుండగా.. మన భారతీయ చిత్రాలు కూడా ఆస్థాయిలో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందులోనూ గ్రాఫిక్స్ ఉన్నాయంటే వాటి స్టాండర్డ్స్ కచ్చితంగా హై లెవల్లో ఉండాలి. మోహన్ లాల్ ఎమోషన్స్ కు ఇచ్చిన ప్రియారిటీ టెక్నికాలిటీస్ కి ఇవ్వలేదు.
ఆండర్ వాటర్ సాంగ్ చాలా ఖర్చు చేసి తీసాం అంటారు.. కానీ ఆ పాట మాత్రం ఏదో యానిమేటెడ్ సాంగ్ లా ఉంటుంది. అలాగే.. 3D కెమెరాలో షూట్ చేసిన సినిమాలో 3D ఎఫెక్ట్స్ అనేవి చాలా అరుదుగా కనిపిస్తాయి. అందువల్ల ఈ సినిమాను 3Dలో తీయాల్సిన అవసరం ఏముంది? అనే అనుమానం కలగక మానదు. కథలో ఎమోషన్ తోపాటు కథనంలో పట్టు కూడా ఉండాలి అనే విషయాన్ని 47 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్న మోహన్ లాల్ గుర్తించకపోవడం గమనార్హం. ఒక దర్శకుడిగా తన ప్రయత్నంలో ఆయన విఫలమయ్యాడు అనే చెప్పాలి.
సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగున్నా.. ఎందుకో అంతగా ఆకట్టుకోలేకపోయింది. సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ గట్రా అన్నీ సోసోగా ఉన్నాయి. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడలేదు కానీ, సినిమా స్థాయికి తగ్గ రేంజ్ ఎక్కడా కనిపించలేదు. డి.ఐ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది, కొన్ని చోట్ల మరీ బ్రైట్ గా ఉంది, ఇంకొన్ని చోట్ల మరీ డార్క్ అయ్యింది. ఈ 3Dలో ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది అనే విషయాన్ని మేకర్స్ గుర్తించాలి.
విశ్లేషణ: జానపద నేపథ్యంలో మన కథలు ప్రస్తుత తరానికి అందించాలి అనే ఆలోచన మంచిదే అయినప్పటికీ.. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టిన విధానం అలరించే విధంగా లేకపోవడంతో “బరోజ్” ఆకట్టుకోవడంలో విఫలమైంది. దర్శకుడిగా మోహన్ లాల్ ఆలోచనను మెచ్చుకోవాలి అనిపించినప్పటికీ.. టెక్నికల్ గా దాన్ని ప్రెజెంట్ చేసిన విధానంలో చాలా లోపాలు ఉండడంతో 154 నిమిషాలపాటు థియేటర్లో కూర్చోవడం కష్టం అనిపిస్తుంది.
ఫోకస్ పాయింట్: ఇసాబెల్లాతో అంత ఈజీ కాదు మోహన్ లాల్ సాబ్!
రేటింగ్: 2/5
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus