అందమైన రంగురంగుల పూలు.. వాటితో పోటీపడే ఆడపడుచులు.. ఇద్దరినీ కలిపే పాటలు.. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ గురించి చెప్పగానే కళ్లముందుకదలాడే సౌందర్యం రూపం. వర్షాలు భూమాతను ముద్దాడిన తర్వాత తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలు వాడవాడలా మొదలయ్యాయి. ఈ సందర్భంగా v6 న్యూస్ ఛానల్స్ వాళ్లు తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలుపుతూ “బతుకమ్మ పాట 2016” ని యూట్యూబ్ లో విడుదల చేశారు.
“కోలో కోలో కోల్ .. కొమ్మ పూసే కోల్” అనే మొదలయ్యే పాట నెటిజనులు ఆకట్టుకుంటోంది. ఈ వీడియో విపరీతమైన లైకులు అందుకుంటోంది. వీక్షకులు కూడా రోజురోజుకు పెరుగుతున్నారు. అద్భుతమైన పాటలకు చక్కగా ముస్తాబైన చిన్నారులు, యువతులు, మహిళలు అందరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం వీడియోకు మరింత అందాన్ని తెచ్చి పెట్టింది. అందుకే ఈ పాట రిలీజ్ అయి వారం కూడా కాకముందే 14 లక్షల వ్యూస్ మార్క్ ని దాటింది.