Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కార్తికేయ, నేహా శెట్టిల ‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి

కార్తికేయ, నేహా శెట్టిల ‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి

  • December 21, 2022 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కార్తికేయ, నేహా శెట్టిల ‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు, క్లాక్స్ దర్శకుడు. ఇందులో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయిక. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ అని ఓ వీడియో విడుదల చేశారు.

ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో ‘బెదురులంక 2012’ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శక – నిర్మాతలు ఇంతకు ముందు తెలిపారు. ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక 2012’ వీడియోలో ఆ ఊరిని, అందులో మనుషులను పరిచయం చేశారు.

విశాలమైన గోదావరి… తీరంలో పచ్చటి కొబ్బరి చెట్లు… మధ్యలో మనుషులు… బండి మీద దూసుకు వెళుతున్న కథానాయకుడు కార్తికేయ… ఊరు ఎలా ఉంటుందో వీడియో ప్రారంభంలో చూపించారు. కళ్ళకు కనిపించే విజువల్ కంటే చెవులకు వినబడే సంగీతం సెకన్లలో మైండ్‌కు ఎక్కేసేలా ఉంది.

”హొయ్ రబ్బోయ్… ఓరి నాయనా…
ఇదేంట్రోయ్… ఈ మాయ” అని నేపథ్యంలో సాంగ్ వినిపిస్తుంటే… స్క్రీన్ మీద నిజంగా మాయ జరుగుతున్నట్లు ఉంటుంది. వెంటనే విజువల్‌తో కనెక్ట్ అవుతాం.

”అయ్ బాబోయ్…
ఆగలేం రోయ్…
వచ్చేయండ్రోయ్…
వెయిటింగ్ ఇక్కడ”
అని సాంగ్ వినిపిస్తున్న సమయంలో ఫుడ్ కోసం వెయిటింగ్ చేస్తున్న జనాలు అందరూ ఒక్కసారిగా తిండి మీద పడితే… ప్రేమ కోసం పరితపించే జంటను మరోవైపు చూపించారు.

సుమారు నిమిషం నిడివి గల టీజర్‌లో కార్తికేయ, నేహా శెట్టి  మధ్య ప్రేమతో పాటు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ బసిరెడ్డి, గోపరాజు రమణ, ‘ఆటో’ రామ్ ప్రసాద్ క్యారెక్టర్లనూ దర్శకుడు క్లాక్స్ పరిచయం చేశారు. యుగాంతం వస్తుందని ఊరిలో ప్రజలు అందరూ ఎంజాయ్ చేసే విధానం నవ్వులు పూయించేలా ఉంది.

‘ఇదంతా సూతంటే నీకు ఏమనిపితంది’ అని అజయ్ ఘోష్ అడిగితే ‘మంచి ఫన్నీగా ఉంది’ అని చెప్పాలనిపిస్తుంది. ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ ఎలా ఉంటుందో వీడియోలో చక్కగా చూపించారు.

చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ “మా సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫుల్ స్వింగులో అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. సినిమా బాగా వస్తోంది. ప్రేక్షకులు అందరినీ నవ్వించే కొత్త తరహా చిత్రమిది. డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. జనవరి తొలి వారంలో టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం” అని చెప్పారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “కార్తికేయ, నేహా శెట్టి జోడీ మధ్య కెమిస్ట్రీ ‘ద వరల్డ్ ఆఫ్ బెదురులంక’ వీడియోలో చూశారు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అంత కంటే బావుంటాయి. మిగతా క్యారెక్టర్లు చేసే పనులు కూడా అంతే నవ్విస్తాయి. ప్రేక్షకుల నుంచి ఈ రోజు విడుదల చేసిన వీడియోకి మంచి స్పందన లభిస్తోంది. ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది. టీజర్, ట్రైలర్, సినిమాను త్వరలో మీ ముందుకు తీసుకు రావాలని ఉంది” అని చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bedhurulanka 2012
  • #Karthikeya
  • #Neha Shetty

Also Read

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

related news

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

Dj Tillu: ‘డిజె టిల్లు’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే!

trending news

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

1 hour ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

3 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

4 hours ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

6 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

23 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

5 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

7 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

21 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

23 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version