Chiranjeevi: ‘ఆటో జానీ’కి ముందు మరో కథ అనుకున్నారు… ఆ పేరేంటో తెలుసా?

చిరంజీవి (Chiranjeevi) – పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్‌లో సినిమా అంటూ చాలా ఏళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. పూరి సినిమా విడుదలవుతోంది అంటే.. కొత్త ప్రాజెక్ట్‌ ఇదే అవ్వొచ్చు అనే డిస్కషన్‌ మొదలవుతుంది. అప్పుడు చిరంజీవి పేరు కూడా చర్చలోకి వస్తుంది. ఎందుకంటే పూరితో ఓ సినిమా చేస్తా అని, చేయాలి అని చిరు ఎప్పటి నుండో అనుకుంటున్నారు కాబట్టి. ఈ క్రమంలో రెండు, మూడుసార్లు చివరి వరకొచ్చినా ఆగిపోయింది ప్రాజెక్ట్‌.

Chiranjeevi

అలా ఆగిపోయిన ఓ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సినిమాను ఓ పేరు అనుకున్నారు అంటూ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతగా ఆ పేరులో ఏముంది అనుకుంటున్నారా? ఆ పేరు తెలిస్తే మీరు కూడా ‘అవునా నిజమా’ అంటూ అదేదో యాంకర్‌ అన్నట్లు నోరెళ్లబెడతారు. పూరి జగన్నాథ్ కెరీర్‌ జోరు పీక్స్‌లో ఉన్నప్పుడు చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా గురించి చర్చలు జరిగాయి.

అలా ‘ఆంధ్రావాలా’ (Andhrawala) సినిమా సమయంలో ఓసారి దర్శకుడు పూరి స్పెషల్‌గా ఓ పాత్రను డిజైన్ చేసి చిరంజీవికి వినిపించారట. నిజానికి మూడు కథల గురించి చెప్పగా చిరంజీవి ఒకటి ఫైనలైజ్‌ చేశారట. దానికి గమ్మత్తుగా ‘శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ’ అని పేరు అనుకున్నారట. వినోదం, యాక్షన్‌ అంశాలను మిక్స్‌ చేసి రాసుకున్న ఆ కథ విషయంలో చిరంజీవి తొలుత కాస్త ఓకే అనుకున్నా.. ఆ తర్వాత ఎందుకో వెనకడుగు వేశారట.

దాంతో ‘పోకిరి’ (Pokiri) కథ మహేష్‌బాబుకి (Mahesh Babu) చెప్పి అటువైపు వెళ్లిపోయారు పూరి. అయితే చిరంజీవి 150వ సినిమాగా ‘ఆటో జానీ’ని చేద్దాం అనుకున్నారు. సెకండాఫ్‌ విషయంలో అసంతృప్తి వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇదన్నమాట చిరు – పూరి సినిమా కథ. అన్నట్లు ‘గాడ్‌ ఫాదర్‌’ (Godfather) తర్వాత కూడా ఇద్దరి సినిమా విషయంలో పుకార్లు వచ్చాయి కానీ ఏదీ ఓకే అవ్వలేదు. ఇప్పుడు ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) పరాజయంతో పూరి డల్‌ అయ్యారు. మరి కొత్త సినిమా ఎప్పుడు చేస్తారో?

ఫ్యామిలీ గొడవను ఆపేందుకు మంచు లక్ష్మి ప్రయత్నం.. చివరికి ఇలా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus