Bellamkonda Ganesh: మొదటి హీరోయిన్ తో పెళ్లి వార్తలపై హీరో బెల్లంకొండ గణేష్ కామెంట్స్ వైరల్

‘స్వాతిముత్యం’ సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్… ఆ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోయినా.. ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక గణేష్ త్వరలో ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అవంతిక దస్సాని ఈ చిత్రంలో హీరోయిన్. సముద్ర ఖని కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. జూన్ 2న ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ‘స్వాతి ముత్యం’ సినిమా రిలీజ్ అయ్యాక బెల్లంకొండ గణేష్.. ఆ చిత్రం హీరోయిన్ వర్ష బొల్లమ్మతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. వీరి పెళ్ళికి.. పెద్దలు కూడా అంగీకరించారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అవి అవసత్వాలని వెంటనే తేలిపోయింది.

తాజాగా గణేష్ (Bellamkonda Ganesh) కి ఈ విషయమై ఓ ప్రశ్న ఎదురైంది. ‘నా మొదటి సినిమాకే ఇలాంటి రూమర్స్ ఎందుకు పుట్టాయో అర్థం కాదు. మా నాన్న గారు.. నా పెళ్ళికి ఒప్పుకున్నట్టు ఏంటేంటో రాసేశారు. అవి చూసి నవ్వుకుని వదిలేశాను అంతే. ప్రస్తుతం నా ఫుల్ ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ‘నేను స్టూడెంట్ సర్’ సినిమా తనకు మంచి పేరు తెచ్చి పెడుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus