అలా ట్రోల్ చేస్తే అస్సలు పట్టించుకోనన్న బెల్లంకొండ గణేష్!

బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే పలు సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కగా దసరా పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలు విడుదలైన రోజునే ఈ సినిమా రిలీజ్ కానుండటంతో

ఈ సినిమా మేకర్స్ కు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. స్వాతిముత్యం ట్రైలర్ రిలీజ్ వేడుకలో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ మొదటిరోజు సెట్ లోకి అడుగుపెట్టిన వెంటనే కంగారు పడ్డానని కానీ చిత్ర బృందం నాకెంతో సపోర్ట్ చేసిందని బెల్లంకొండ గణేష్ చెప్పుకొచ్చారు. బయట బ్యానర్ లో చేస్తే స్వతహాగా గుర్తింపు వస్తుందని నేను నమ్ముతానని బెల్లంకొండ గణేష్ పేర్కొన్నారు.

స్వాతిముత్యం సినిమా ఒప్పుకున్న సమయంలో నాతో పాటు అన్నయ్య కూడా కథ విన్నాడని బెల్లంకొండ గణేష్ అన్నారు. స్వాతిముత్యం నాకు మంచి లాంఛ్ అవుతుందని అన్నయ్య నమ్మాడని బెల్లంకొండ గణేష్ చెప్పుకొచ్చారు. మా నాన్న నిర్మాత నేను యాక్టర్ అని బెల్లంకొండ గణేష్ తెలిపారు. మా నాన్న నేను వేర్వేరు రంగాలలో ఉండటంతో నేను నెపో కిడ్ కాదని గణేష్ కామెంట్లు చేశారు. స్వాతిముత్యం సినిమా చూసిన తర్వాత నాపై ట్రోలింగ్ జరిగితే నేను ఫీలవుతానని బెల్లంకొండ గణేష్ చెప్పుకొచ్చారు.

అసలు నేనేంటో తెలియకుండా నా గురించి ట్రోల్స్ చేస్తే మాత్రం అస్సలు పట్టించుకోనని బెల్లంకొండ గణేష్ కామెంట్లు చేశారు. బెల్లంకొండ గణేష్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వాతిముత్యం సినిమాతో బెల్లంకొండ గణేష్ సక్సెస్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus