బెల్లకొండ నిర్ణయం సరైనదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు..హరీష్ శంకర్ డైరెక్షన్లో చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ఆందుకుని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. మధ్యలో ‘జల్సా’ వంటి హిట్ ఉన్నప్పటికీ.. అది పవన్ మార్క్ సినిమా అనే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన పాటలు మరియు బ్రహ్మానందం కామెడీతో ఆ సినిమా సేఫ్ అయిపోయింది. అయితే ‘గబ్బర్ సింగ్’ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టి పవన్ స్టామినా ఏంటన్నది తెలియజేసింది.

ఇది బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో ఆ చిత్రానికి సీక్వెల్ కూడా వచ్చింది కానీ.. దానిని పవన్ టచ్ చెయ్యలేదు. సొంతంగా కథ రాసుకుని.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గా రూపొందించాడు. ఫలితం పక్కన పెడితే.. మళ్ళీ ‘దబాంగ్2’ ని మాత్రం రీమేక్ చెయ్యలేదు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ‘రాక్షసుడు’ చిత్రంతోనే మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇది కూడా కోలీవుడ్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ‘రాట్ససన్’ చిత్రానికి కోలీవుడ్ లో సీక్వెల్ ప్లాన్ చెయ్యలేదు. అయితే దానిని తెలుగులో రీమేక్ చేసిన దర్శకుడు రమేష్ వర్మ మాత్రం సీక్వెల్ ప్లాన్ చేశాడట. ‘రాక్షసుడు’ నిర్మాతలే ‘రాక్షసుడు2’ ని కూడా నిర్మించబోతున్నారని తెలుస్తుంది.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఈ సీక్వెల్ లో నటించడానికి అంగీకరించడం లేదట. నిజానికి రమేష్ వర్మ తెరకెక్కించిన సినిమాల్లో ‘రైడ్’ ‘రాక్షసుడు’ తప్ప మరో హిట్ లేదు. అవి రెండు కూడా రీమేక్ లే.ఆయన స్ట్రెయిట్ తెలుగు సినిమాలు అయిన ‘వీర’ ‘అమ్మాయితో అబ్బాయి’ ‘ఒక ఊరిలో’ వంటివి ఫ్లాప్ అయ్యాయి. అందుకే బెల్లంబాబు బయపడ్డాడా లేక మంచి క్లాసిక్ ను చెడగొట్టడం ఎందుకు అని భావిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus