టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) సినీ రంగానికి కొంతకాలం దూరమయ్యారు. అయినప్పటికీ, తన కొడుకులైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) – సాయి గణేష్‌లను (Bellamkonda Ganesh Babu) హీరోలుగా పరిచయం చేస్తూ, వారితో మంచి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేశారు. తాజాగా బెల్లంకొండ సురేష్ ఓ ఇంటర్వ్యూలో తన వారసులు, భవిష్యత్తు ప్రాజెక్టులు, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్నారని బెల్లంకొండ సురేష్ తెలిపారు.
‘‘మా పెద్దబ్బాయి శ్రీనివాస్‌కి అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. వచ్చే ఏడాది పెళ్లి జరగనుంది,’’ అని ప్రకటించారు. ఇది ఫ్యామిలీకి ఒక గొప్ప అనుభవం అని, పెళ్లి ఆత్మీయ వాతావరణంలో గ్రాండ్‌గా జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండు సినిమాల్లో నటిస్తున్నారు – ‘‘భైరవం’’ (BSS11) అలాగే ‘‘టైసన్ నాయుడు’’ (Tyson Naidu). వీటితో పాటు మరొక రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.
2024లో వీటిని విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. బెల్లంకొండ సురేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీనివాస్‌కి 2024 చాలా ముఖ్యమైన సంవత్సరం. హిట్ కోసం మా వాడు చాలా కష్టపడుతున్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు. మూడో క్వార్టర్ నుంచి సినిమాలు రిలీజ్ అవుతాయి.. అని అన్నారు.
చత్రపతి హిందీ రీమేక్‌తో నిరాశ ఎదురైన శ్రీనివాస్‌కి హిట్ పడక చాలా కాలం అయింది. అయితే ఆయన యాక్షన్ హీరోగా తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడు. అభిమానులు ఈసారి విభిన్నమైన కథలతో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. భైరవంలో పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, లవ్ కమ్ ఎంటర్‌టైనర్‌గా టైసన్ నాయుడు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని బెల్లంకొండ సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.