Stuartpuram Donga: గజదొంగ బయోపిక్ లో బెల్లంకొండ!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో సినిమాలు స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. రాక్షసుడు సినిమా హిట్ అయిన తర్వాత కాస్త జోరు పెంచిన ఈ హీరో చత్రపతి రీమిక్ తో ఎలాగైనా బాలీవుడ్ లో మార్కెట్ సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఆ సినిమాను పూర్తి చేసిన తర్వాత గాని మరో సినిమాను మొదలు పెట్టవద్దు అని అనుకున్నాడు. కానీ ఎక్కువ గ్యాప్ రావడంతో వీలైనంత త్వరగా మరికొన్ని సినిమాలు తెలుగులో కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.

గత రెండేళ్లుగా చర్చల దశలో ఉన్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. స్టువర్ట్ పురం దొంగ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కనున్నట్లు పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 1980ల కాలంలో ఆంధ్ర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి తప్పించుకున్న ఈ గజదొంగ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను క్రియేట్ చేసుకున్నాడు. చివరికి పోలీసుల చేతిలోనే మరణించాడు. అతనిపై అనేక రకాల కథనాలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అతను కేవలం ఒక దొంగ మాత్రమే కాదు.. ఉన్నవారి నుంచి దోచుకొని లేనోడికి పెట్టడం అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్ళాడు.

అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ నీ తెరపైకి తేవాలని చాలా రోజులుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇక మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్ టైగర్ నాగేశ్వరరావుగా కనిపించడానికి రెడీ అవుతున్నాడు. అందుకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు KS దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ హోమ్ బ్యానర్ శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ లో బెల్లంకొండ సురేష్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus