టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల హిందీ డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్లు గతంలో చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అయితే యూట్యూబ్ లో తన సినిమాల హిందీ వెర్షన్లతో బెల్లంకొండ శ్రీనివాస్ అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకోవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన జయ జానకి నాయక తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ మూవీగా నిలిచింది.
అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ లో ఏకంగా 800 మిలియన్ల వ్యూస్ తో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. సౌత్ డబ్బింగ్ మూవీస్ లో ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్న తొలి మూవీ జయ జానకి నాయక అని తెలుస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులు యాక్షన్ సినిమాలను ఎంతో ఇష్టపడతారు. ఖుంఖార్ పేరుతో పెన్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ లో హిందీలో ఈ సినిమా డబ్ అయ్యి రిలీజ్ కాగా అక్కడ ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) నటించిన సీత హిందీ వెర్షన్ 640 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా బెల్లంకొండ శ్రీనివాస్ కవచం మూవీ హిందీలో వేర్వేరు ఛానళ్లలో 800 మిలియన్ వ్యూస్ ను సాధించడం గమనార్హం. ఎంతోమంది బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ కు సైతం సొంతం కాని రికార్డులను బెల్లంకొండ శ్రీనివాస్ సొంతం చేసుకుంటూ ఉండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
ప్రస్తుతం సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.
‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?