బెల్లంకొండ, కాజల్ (Kajal Aggarwal) అనగానే చాలామంది డైవర్ట్ అయ్యి ఎక్కడికో వెళ్లిపోతారు. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) , స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ..లు ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారు అని.. ప్రచారం గట్టిగా జరిగింది. కానీ అందులో నిజం లేదు అని తర్వాత తేలింది. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది ఆ విషయం గురించి కాదు. ఇది వేరు. శ్రీను వైట్ల (Srinu Vaitla) డైరెక్షన్లో ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన ‘బాద్ షా’ సినిమాలో కాజల్ అగర్వాల్.. ప్రతిసారి బంతి గురించి ఏవేవో ఫిలాసఫీలు చెబుతూ ఉంటుంది.
అవి ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించాయి. కాజల్లోని కామెడీ టైమింగ్ ని బయటకు తీసింది ఆ సినిమా. సరిగ్గా ఇప్పుడు సీనియర్ నిర్మాత, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి అయిన బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) కూడా ‘బాద్ షా’ లో కాజల్ మాదిరి మారిపోయి ఫిలాసఫీ చెప్పారు. అది కూడా వినాయక్, పూరీ జగన్నాథ్ వంటి సీనియర్ స్టార్ డైరెక్టర్ల గురించి. విషయం ఏంటంటే.. వినాయక్ తో (V. V. Vinayak) బెల్లంకొండ సురేష్ ‘ఆది’ (Aadi) ‘అల్లుడు శీను’ (Alludu Seenu) వంటి సినిమాలను నిర్మించారు. అలాగే పూరీ జగన్నాథ్ (Golimaar) తో ‘గోలీమార్’ (Golimaar) అనే చిత్రాన్ని నిర్మించారు.
అవి బాగా ఆడాయి. ‘ఈ క్రమంలో మీరు మళ్ళీ వాళ్ళతో సినిమాలు చేసే అవకాశం ఉందా? వాళ్ళు ఇప్పుడు ఫామ్లో లేరు కదా’ అంటూ బెల్లంకొండ సురేష్ కి (Bellamkonda Suresh) ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు బెల్లంకొండ సురేష్.. ‘ గాలి ఉన్న బంతి కిందకి పడినా అది వేగంగా పైకి లేస్తుంది. వి.వి.వినాయక్, పూరీ జగన్నాథ్ టాలెంట్ అనే గాలి ఉన్న దర్శకులు’ అంటూ చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాథ్, వినాయక్..లు గతంలో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకులే.. కానీ ఇప్పుడు వరుస ప్లాపులతో రేసులో వెనుకబడ్డారు.