కాజల్ పెళ్లికి తప్పకుండా వెళ్తా : బెల్లంకొండ శ్రీనివాస్

టాలీవుడ్‌ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ‘సీత’, ‘కవచం’ చిత్రాల్లో కలిసి నటించినప్పటి నుండి వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇప్పుడు కాజల్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి తప్పకుండా వెళ్తాననని చెబుతున్నాడు బెల్లంకొండ. ఇటీవల జరిగిన కాజల్‌ ఎంగేజ్‌మెంట్‌కి బెల్లంకొండ వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దానికి సంబంధించిన ఫోటోలు బయటకు రాకపోవడంతో అందులో నిజమెంతో తెలీలేదు.

ఇక ఇప్పుడు బెల్లంకొండ, కాజల్‌ పెళ్లికి వెళ్లనున్నట్లు స్వయంగా వెల్లడించారు. కాజల్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని.. కుటుంబంలోని వ్యక్తితో సమానమని అన్నారు. కాజల్ కి మంచి లైఫ్ పార్ట్నర్ దొరకడం సంతోషంగా ఉందని.. గౌతమ్ గొప్ప వ్యక్తి అని చెప్పారు. వారిద్దరికీ శుభాకాంక్షలు చెప్పిన బెల్లంకొండ.. ప్రస్తుతం తను షూటింగ్ లో ఉన్నానని.. కానీ బ్రేక్ తీసుకొని కాజల్ పెళ్లి హాజరవుతానని చెప్పారు. వేరే పనులు ఉన్నాయని.. కాజల్ పెళ్లి మిస్ చేయలేనని అన్నారు.

ఈ నెల 30న ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకోబోతుంది కాజల్. కరోనా కారణంగా అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో ముంబైలో ఈ వేడుక జరగనుంది. ఈ పెళ్లికి నలభై నుండి యాభై మంది మాత్రమే హాజరు కానున్నారు. టాలీవుడ్ నుండి ఇప్పటికే బెల్లంకొండ కి ఇన్విటేషన్ అందింది. మరి ఇంకెంతమంది సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరవుతారో చూడాలి!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus