మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ఈరోజుతో 20 ఏళ్ళు. అతను దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన మొదటి చిత్రం ఇది. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.2002 వ సంవత్సరం అక్టోబర్ 10 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి, త్రివిక్రమ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఓ తండ్రికి, కూతురికి మధ్య ఓ ఎమోషనల్ బాండింగ్ .. అయితే కూతురి ప్రేమ వల్ల వీరి మధ్య ఏర్పడిన సమస్యల చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. ఈ సినిమాలో కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో, ఎమోషన్ రేంజ్ లో ఉంటుందో, అద్భుతమైన డైలాగులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఈరోజు ఈ చిత్రం విడుదలై 20 ఏళ్ళు పూర్తికావస్తోన్న నేపథ్యంలో ఈ చిత్రంలోని కొన్ని అద్భుతమైన డైలాగులను ఓ లుక్కేద్దాం రండి :