Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » దర్శకరత్న కిరీటంలో ఆణిముత్యాలు

దర్శకరత్న కిరీటంలో ఆణిముత్యాలు

  • May 31, 2017 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దర్శకరత్న కిరీటంలో ఆణిముత్యాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరి నారాయణరావుకి ప్రత్యేక స్థానం ఉంది. స్టార్స్ తోనే కాకుండా నూతన నటీనటులతోను సూపర్ హిట్ చిత్రాలు తీసి.. సినిమాకి అసలైన హీరో డైరక్టర్ అని నిరూపించారు. వినూత్న కథలతో ఎన్నో అపురూప సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. వాటిలో అందరూ మెచ్చిన 15 చిత్రాలపై ఫోకస్…

తాత – మనవడు Tata Manavaduదర్శకుడిగా దాసరి తొలి చిత్రం తాత – మనవడు. తొలి చిత్రంతోనే మధ్యతరగతి జీవితాల్ని బాగా తెరకెక్కించారు. హాస్యనటుడు రాజబాబును హీరోగా చేసిన ఈ మూవీ 25 వారాలు ఆడింది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా తాత – మనవడు ‘నంది’ అవార్డు సొంతం చేసుకుంది.

బలిపీఠంBali Peetamప్రముఖ నవల రచయిత్రి రంగ నాయకమ్మ రాసిన ‘బలిపీఠం’ నవల ఆధారంగా అదే పేరుతో సినిమా తీశారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది.

స్వర్గం – నరకంSwargam - Narakam మోహన్‌బాబు, అన్నపూర్ణలను వెండి తెరకు స్వర్గం – నరకం సినిమా ద్వారా దాసరి పరిచయం చేశారు. మనస్పర్థలు, అపోహలు భార్యాభర్తల జీవితాన్ని నరకకూపంలో ఎలా పడేస్తాయో వివరించిన చిత్రమిది. 1975లో తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డుని సొంతం చేసుకొంది.

తూర్పు – పడమర Toorpu - Padamaraతమిళంలో బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రానికి రీమేక్‌ తూర్పు – పడమర. చాలా క్లిష్టమైన ఈ కథని, సామాన్య ప్రేక్షకుడికి అర్థమయ్యేలా దాసరి ఆవిష్కరించారు. మాధవికి ఇదే తొలి తెలుగు చిత్రం.

కటకటాల రుద్రయ్య Katakatala Rudraiahకృష్ణంరాజుకి రెబల్‌స్టార్‌ ఇమేజ్‌ తీసుకొచ్చిన సినిమా కటకటాల రుద్రయ్య. ఇందులో కృష్ణంరాజును దాసరి కొత్తగా చూపించారు. 25 లక్షలతో తెరకెక్కించిన ఈ చిత్రం.. 75 లక్షలు వసూలు చేసింది. దీనిని తమిళంలో శివాజీ గణేశన్ రీమేక్ చేశారు.

శివరంజని Shivaranjaniసినిమా రంగంపై దాసరి తీసిన సినిమా శివరంజని. ఈ చిత్రంతో జయసుధ పెద్ద స్టార్ అయిపోయారు. దాసరి తన సొంత సంస్థ తారక ప్రభు ఫిలింస్‌ పతాకం మీద నిర్మించిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. శివరంజని బెంగుళూరులో ఏకంగా 52 వారాల పాటు ఆడింది. ఈ రికార్డ్ ని ఏ తెలుగు చిత్రం బీట్ చేయలేదు.

గోరింటాకు Gorintakuదాసరి తొలిసారి ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న సినిమా ‘గోరింటాకు’. శోభన్‌బాబు, సుజాత, సావిత్రి నటించిన ఈ చిత్రంలో ‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా’ అనే కృష్ణశాస్త్రి గీతం, ‘కొమ్మకొమ్మకో సన్నాయి.. కోటి రాగాలు ఉన్నాయి’ అనే వేటూరి గీతం ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.

సర్దార్‌ పాపారాయుడు Sardar Paparayuduఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశానికి పునాది వేసిన చిత్రం ‘సర్దార్‌ పాపారాయుడు’. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేశారు. కేవలం 28 రోజుల్లో చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి ఎక్కువమంది అభిమానులు ఏర్పడ్డారు.

శ్రీవారి ముచ్చట్లు Srivaari Muchatluఈ సినిమాతో దాసరి ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసారు. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద కలిసి నటించిన ఈ చిత్రంలో ట్విస్ట్ లు భలే ఉంటాయి.

ప్రేమాభిషేకం Premabhishekamదాసరి రచించిన ప్రేమకావ్యం… ప్రేమాభిషేకం. ఏఎన్నార్, శ్రీదేవి, జయసుధల నటన అమోఘం. చక్రవర్తి ఇచ్చిన పాటలన్నీ సూపర్ హిట్. ఈ మూవీ 30 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.

మేఘసందేశం Megha Sandeshamఅక్కినేని నాగేశ్వరరావు 200వ చిత్రమిది. సహజీవనం అనే కాన్సెప్టుతో సాగిన ఈ కథ… అప్పట్లో ఓ సంచలనం. అక్కినేని, జయసుధ, జయప్రదల మధ్య సాగే సన్నివేశాలు మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. తొమ్మిది విభాగాల్లో నందుల్ని సొంతం చేసుకుంది.

స్వయం వరం Swayamvaramదాసరి మెగా ఫోన్ నుంచి వచ్చిన మరో ప్రేమ కథా చిత్రం స్వయం వరం. శోభన్ బాబు, జయప్రదలు అద్భుతంగా నటించి వెండి తెర ప్రేమ జంటగా కీర్తి పొందారు.

తాండ్ర పాపారాయుడు Thandra Paparayuduదాసరి తెరకెక్కించిన తొలి చారిత్రక చిత్రమిది. 1775 సంవత్సరం ప్రాంతంలో జరిగిన కథ ఇది. అప్పట్లోనే దాదాపుగా 1.5 కోట్లతో తెరకెక్కించారు. కృష్ణంరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది.

ఒసేయ్‌ రాములమ్మాOsey Ramulamma దాసరి తెరకెక్కించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ‘ఒసేయ్‌ రాములమ్మా’ ఒకటి. . ఉత్తరప్రదేశ్‌లో ఓ గిరిజన మహిళపై జరిగిన అన్యాయాన్ని కథగా మలిచి కమర్షియల్ హిట్ కొట్టారు. రాములమ్మగా విజయశాంతి తొలిసారి డబ్బింగ్‌ చెప్పుకొన్నారు. కృష్ణ, దాసరి కీలక పాత్రల్లో మెరిశారు.

బొబ్బిలిపులి Bobbili Puliఎన్టీఆర్‌ – దాసరి కాంబినేషన్‌లో సంచలన విజయం సాధించిన చిత్రమిది. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికుడు, తన దేశం కోసమే సరిహద్దు లోపల కూడా పోరాడితే ఎలా ఉంటుందన్న అద్భుతమైన ఆలోచనకు తెర రూపం ఈ చిత్రం. పతాక సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ పలికే డైలాగులు హైలైట్‌.

ఇలా చెప్పుకుంటూ పోతే దాసరి ఆణిముత్యాలు మందను దాటేస్తాయి. అందుకే ఇక్కడితో ఆపేస్తున్నాం.. అంతేకానీ మిగతా సినిమాలు తక్కువని కాదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bali Peetam Movie
  • #Best Films of dasari narayana rao
  • #Bobbili Puli Movie
  • #Gorintaku Movie
  • #Katakatala Rudraiah Movie

Also Read

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

related news

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

Naga Vamsi: ఆ రెండు సినిమాలే సర్‌ప్రైజ్‌లు.. ఏమైందో అర్థం కాలేదన్న నాగవంశీ.. ఆలోచిస్తే..

Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

Shah Rukh Khan: షూటింగ్‌లో గాయపడ్డ షారుఖ్‌ ఖాన్‌.. విదేశాలకు తీసుకెళ్తున్నారా?

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

నేను బెడ్ రూమ్ సీన్స్ లో నటించాను.. కానీ హీరోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా?

నేను బెడ్ రూమ్ సీన్స్ లో నటించాను.. కానీ హీరోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు తెలుసా?

Kalyan Ram: 17 ఏళ్ళ కళ్యాణ్ రామ్ హిట్ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!

Kalyan Ram: 17 ఏళ్ళ కళ్యాణ్ రామ్ హిట్ సినిమా వెనుక ఇంత కథ నడిచిందా..!

Kalyana Ramudu: 22 ఏళ్ళ ‘కళ్యాణ రాముడు’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Kalyana Ramudu: 22 ఏళ్ళ ‘కళ్యాణ రాముడు’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

trending news

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

Prabhas: ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబో.. ఇప్పట్లో కష్టమే..!

5 hours ago
Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

Genelia: భర్త రితేష్ గురించి జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు!

8 hours ago
Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

22 hours ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

1 day ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

1 day ago

latest news

Chiranjeevi, Jr NTR: ఎన్టీఆర్ ప్లాప్ సినిమాకి కూడా అలాంటి రికార్డు ఉందా.. 23 ఏళ్ళ క్రితం అలా..

Chiranjeevi, Jr NTR: ఎన్టీఆర్ ప్లాప్ సినిమాకి కూడా అలాంటి రికార్డు ఉందా.. 23 ఏళ్ళ క్రితం అలా..

6 hours ago
Aditya 369: 34 ఏళ్ళ ‘ఆదిత్య 369’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయం!

Aditya 369: 34 ఏళ్ళ ‘ఆదిత్య 369’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయం!

6 hours ago
సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

9 hours ago
స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

1 day ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version