ఆర్.ఆర్.ఆర్ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరు అద్భుతంగా నటించారనే ప్రశ్నకు న్యూట్రల్ ఫ్యాన్స్ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పలేమని ఇద్దరు హీరోలు తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని కామెంట్లు చేశారు. సినిమాలో చరణ్ అభిమానులకు చరణ్ పాత్ర నచ్చగా తారక్ పాత్ర నిడివి కొంచెం తక్కువైనా తన నటనతో తారక్ చిన్నచిన్న ఎక్స్ ప్రెషన్లను సైతం అద్భుతంగా పలికి ఆకట్టుకున్నారు. అయితే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) లో భాగంగా బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ కేటగిరీలో అటు ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్ ఉన్నారు.
డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ, మేజర్ సినిమతో అడివి శేష్, సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్, కార్తికేయ2 సినిమాతో నిఖిల్ కూడా ఈ జాబితాలో నిలిచారు. ఎన్టీఆర్, చరణ్ లలో ఒకరు ఈ అవార్డ్ కు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 15, 16 తేదీలలో ఈ ఈవెంట్ జరగనుండగా ఈ ఈవెంట్ లో ఏ హీరో విజేతగా నిలుస్తారో చూడాలి. ఎవరు విజేతగా నిలిచినా మరో హీరోను తక్కువ చేయాల్సిన అవసరం అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చరణ్, ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరు విజేతగా నిలిస్తే చరణ్, ఎన్టీఆర్ లకు కలిపి ఈ అవార్డ్ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న సైమా ఈవెంట్ కోసం అటు చరణ్ ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ కలిసి భవిష్యత్తులో మరిన్ని మల్టీస్టారర్లు చేయాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉండగా చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్, చరణ్ లను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?