యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ‘భగత్ సింగ్ నగర్’

విదార్థ్, ధృవీక ప్రధాన పాత్రల్లో బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, అజయ్ గోష్, ప్రభావతి వంటి వారు కీలక పాత్రల్లో వాలాజా క్రాంతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. ప్రభాకర్ దమ్ముగారి సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజేష్ పీటర్ సినిమాటోగ్రఫీ అందించారు.’గ్రేట్ ఇండియా మీడియా హౌస్’ బ్యానర్ పై  వాలాజ గౌరి, రమేష్ ఉడత్తు ఈ చిత్రాన్ని నిర్మించారు.నవంబర్ 26న విడుదలైన ఈ చిత్రానికి నిన్న అనగా నవంబర్ 25న ప్రీమియర్ షో వేయగా… దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది.

భగత్ సింగ్ నగర్ అనేది మురికివాడ. ఈ ఏరియాకి చెందిన కుర్రాడు శ్రీను (విదార్థ్) చంద్రయ్య (ముని చంద్ర) ఇంట్లో పెరిగే అమ్మాయి లక్ష్మి (దృవీక) ను ప్రేమిస్తాడు.వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలని భావిస్తారు. శ్రీను లక్ష్మి ల పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకుంటాయి కానీ వీళ్ళ పెళ్లి జరిగే సమయానికి లక్ష్మి పై కొందరు అత్యాచారానికి పాల్పడతారు.అడ్డుపడ్డ శ్రీనుని కూడా చంపేస్తారు.లక్ష్మీ మాత్రమే కాదు ఆ ఏరియాకి చెందిన ఎంతో మంది అమ్మాయిలు కూడా అత్యాచారానికి గురవుతారు.దీని పై భగత్ అనే కుర్రాడు కేసు వేసి పోరాటం మొదలుపెడతాడు.ఈ కేసులో ఎమ్మెల్యే వైసీ రావు (అజయ్ ఘోష్ ) కు పోలీసులకి సంబంధం ఉందని తెలుస్తుంది. మరి వీరి పై భగత్ పోరాటం గెలిచిందా లేదా అనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది.

తప్పు చేస్తే ఎంతటి వారినైనా ధైర్యంగా నిలదీయాలి, పోరాడాలి అనే పాయింట్ తో ‘భగత్ సింగ్ నగర్’ ను తెరకెక్కించాడు దర్శకుడు వాలాజ క్రాంతి. సొసైటీ మారాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి.ఈ లైన్ ను మనం చాలా సినిమాల్లో చూసాం… కానీ ఇప్పటి ట్రెండ్ కు తగినట్టు కథనం కొత్తగా ఉంటుంది. శ్రీను, భగత్ రెండు పాత్రల్లోనూ షేడ్స్ ను చూపించాడు విదార్థ్. లక్ష్మి, అనన్య పాత్రల్లో దృవీక లుక్స్ ఆకట్టుకుంటాయి. ఎమ్మెల్యే సీవీఆర్ గా అజయ్ ఘోష్ నటన సూపర్బ్ అనిపించారు. సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ అన్ని విభాగాలు చాలా కష్టపడి పనిచేసారు కాబట్టి మంచి క్వాలిటీ ఔట్పుట్ వచ్చింది. ‘గ్రేట్ ఇండియా మీడియా హౌస్’ వారు ఖర్చుకి వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సందేశాత్మక చిత్రాలు ఎన్నో వచ్చినప్పటికీ యువతని ప్రేరేపించే చిత్రాలు కొన్ని క్లాసిక్స్ అనిపించుకున్నాయి.మరీ అంత కాకపోయినా వాలాజ క్రాంతి తెరకెక్కించిన ‘భగత్ సింగ్ నగర్’ చూడతగినదే అనే పాజిటివ్ టాక్ దక్కించుకుంటుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus