‘భగత్ సింగ్ నగర్’ ప్రి రిలీజ్ ఈవెంట్

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం “భగత్ సింగ్ నగర్” .తెలుగు మరియు తమిళ బాషలలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను  ప్రకాష్ రాజ్ గారు  విడుదల చేయడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి హైప్ రావడం జరిగింది..”భగత్ సింగ్ నగర్” నుంచి విడుదల అయిన  ‘చరిత చూపని’ మొదటి లిరికల్ సాంగ్ కు 1మిలియన్ + వ్యూస్ తో ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. రెండవ పాట ‘ఈ విశ్వమంతము వ్యాపించిన’ పాటను హీరో శ్రీకాంత్, బెనర్జీ చేతులు మీదుగా విడుదల చేశారు.యుగ యుగమైన తరగని వేదన’  పాటను  చిత్ర యూనిట్  విడుదల చేశారు ,భగత్‌ సింగ్‌ నగర్‌’’ చిత్రాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి పిలుపు నిచ్చారు.

ఇలా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ చిత్రానికి సపోర్టు గా నిలుస్తూ ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రాలు తీయాలని పిలుపు నియ్యడం జరిగింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 26 న ప్రేక్షకుల ముందుకు సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిధులుగా ప్రసన్నకుమార్, దర్శకులు రమణారావు, చంద్ర మహేష్,నటుడు బెనర్జీ, బిగ్ బాస్ ఫేమ్ జెస్సీ, సందీప్, తుమ్మల చంద్ర, కళ్యాణ్ సుంకర, వీర కనక  మేడల తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ ను బెస్ట్ విషెస్ తెలియజేశారు.అలాగే చిత్ర యూనిట్ తో కలసి బిగ్ టికెట్ ను, థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేయడం జరిగింది. అనంతరం జరిగిన పాత్రికేయులు సమావేశంలో

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ..”భగత్ సింగ్”  అంటేనే మనందరిలో ఒక తెలియని వైబ్రేషన్ కలుగు తుంది.అలాగే మనందరికీ ఈ పెరు వింటే  ఆలోచింప జేస్తుంది. గతంలో వీరుల గురించి తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి ఎన్నో అవార్డులు రావడంతో తెలుగు ఇండస్ట్రీకు ఏంతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వస్తున్న సినిమాలు పాన్ ఇండియా గా విడుదల అవుతున్నాయి. డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన లేకుండా మంచి మెసేజ్ ఉన్న చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఇండస్ట్రీకు వచ్చిన ఈ కొత్త ప్రొడ్యూసర్లు మంచి దర్శకుడిని, బెనర్జీ లాంటి మంచి అర్టిస్టులను సెలెక్ట్ చేసుకుని చేసిన ఈ సినిమాను కేరళ లో ఎడిటింగ్ చేసి, చెన్నైలో డబ్బింగ్ చెప్పుకొన్నారు అంటే సినిమా పై వీరికున్న ప్యాషన్ ఎంటనేది అర్థమవుతుంది.

సినిమా ట్రైలర్ చాలా బాగుంది .”చరిత చూపని” సాంగ్ చూస్తుంటే మన బ్లడ్ ఉడికిపోతుంది ఆ పాట ఇప్పటికీ1మిలియన్ + వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది. భగత్ సింగ్ నగర్ లాంటి మంచి సినిమా తీస్తున్న ఇలాంటి దర్శక,నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. చిత్ర నిర్మాత రమేష్ ఉడత్తు లండన్ లో ఉంటూ చిత్ర యూనిట్ పై, దర్శకుడి పై మీద నమ్మకంతో ఏ రోజు కూడా లొకేషన్ కు రాకుండా వారికి కావలసిన ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. క్రాంతి గారి ఫ్యామిలీ కూడా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మంచి మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దర్శక, నిర్మాతలకు ఈ “భగత్ సింగ్ నగర్” సినిమా ఎన్నో అవార్డులతో ఎన్నో లాభాలు కూడా తీసుకువస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ … నేను ఎన్నో సినిమాలు తీశాను కానీ.ఇంత సూటబుల్ ఉన్న స్టోరీ నాకు రాలేదు.ఈ సినిమా చూసిన తరువాత ఇలాంటి మంచి సినిమా నేను ఎందుకు చేయలేదని బాధపడుతున్నాను. నాకు చాలా ఏళ్ల నుంచి క్రాంతి తెలుసు ఇంత టాలెంట్ తో తీస్తాడని అనుకోలేదు.కోవిడ్ కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా నిర్మాతల సహకారంతో మంచి క్వాలిటీ తో ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రాన్ని తీశాడు. ఇలాంటి డైరెక్టర్లు దర్శక, నిర్మాతలను మనమందరం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి.ఇండస్ట్రీకు కూడా మంచిపేరు వస్తుంది. “భగత్ సింగ్ నగర్” అంటే ఏమిటి అనేది  సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా గొప్ప హిట్ అవ్వాలని కోరుతున్నాను అన్నారు.

నటుడు బెనర్జీ మాట్లాడుతూ.. మంచి ట్యాలెంట్ ఉన్న అనేక మంది కొత్త దర్శకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.కానీ నిర్మాతల కొరత వల్ల వారికి అవకాశం లభించడం లేదు.ఒక ఫ్యామిలీ అందరూ కలసి రమేష్ ఉడత్తు గారి సహకారంతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసి తీయడం జరిగింది. ఈ ఫ్యామిలీ అంతా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కష్టాల నుండి వచ్చిన సినిమానే “భగత్ సింగ్ నగర్”.ఒక చిన్న సినిమాను మంచి మెసేజ్ తో తన పరిధిలో చాలా చక్కగా నిర్మించాడు. ఇదే స్క్రిప్ట్ వేరే విధంగా అవకాశం వచ్చింటే ఇది ఒక పెద్ద సినిమా అయ్యుండేది. ఇలాంటి సినిమాలు యుంగ్ జనరేషన్ చాలా అవసరం . వారంతా ఇలాంటి సినిమాలు చూసి మంచి చెడు తెలుసు కోవడమే కాకా స్వాతంత్ర్యం కొసం పోరాడిన వారి హిస్టరీ తెలుసుకుంటారు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు రావాలి అందరూ తప్పకుండా చూడాలి. మ్యూజిక్ చాలా బాగుంది.ఈ సినిమా కోసం పని చేసిన టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

నటుడు మునిచంద్ర మాట్లాడుతూ ..నేను ఇండస్ట్రీకు 1996 లో వచ్చాను.స్టిల్ ఫోటో గ్రాఫర్ గా చాలా సినిమాలు చేశాను.ఈ మధ్య అరిస్టు గా చేస్తున్నాను. ఈ చిత్ర దర్శకుడు, హీరో మా అబ్బాయిల చేస్తున్నారు. ఎంతో మంది కొత్త దర్శకులు ఇండస్ట్రీ కు వస్తున్నారు.వారిలో ట్యాలెంట్ ఉంటేనే అదరించండి అని అన్నారు.

చిత్ర హీరో విదార్ధ్ మాట్లాడుతూ.. ఈ సినిమా గ్రూప్ ఆఫ్ ప్యాసినెట్ పీపుల్ ప్రోడక్ట్ ఈ సినిమా. మా తల్లిదండ్రులు, అన్న, ఫ్రెండ్స్ సపోర్ట్ తో ఈ సినిమా చేయడం జరిగింది.ఈ మధ్య అన్ని కూడా ఆన్ లైన్ లో కానిస్తున్నాము. ఈ సినిమా పూర్తి చేయడానికి చాలా మంది హెల్ప్ చేశారు. భగత్ సింగ్ నగర్ మూవీ లో నాకు నచ్చిన అంశం రెస్పాండ్ అవ్వడం. టెక్నాలజీ పెరిగే సరికి అన్ని ఆన్ లైన్ అయ్యాయి. అలాగే ఏదైనా ఇస్యు అయితే ఆన్ లైన్ లో రెస్పాన్ద్ అవుతున్నాము.కానీ మన కళ్ళ ముందు ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఎదుటి వ్యక్తి హెల్ప్ అడిగితే అది మనకెందుకులే అని పక్కకు వెళ్తూ.. మన ఫ్యామిలీ బాగుంటే చాలు అని చూస్తున్నాము.ఇలాగే ఉంటే ఫ్యూచర్ లో మనపిల్లలు కూడా ఇలాగే అలవాటుపడతారు.

ఇలా ఉంటే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. మనమంతా హ్యూమన్స్ అందరూ స్పందించాలని కోరుతున్నాను.ఈ “భగత్ సింగ్ నగర్” సినిమా ఆయన చెప్పిన లైన్ ఏదైనా జరిగితే రెస్పాన్ద్ అవడం లాంటి కాన్సెప్ట్ తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది.అందరికీ న్యాయం చేయలేము. కానీ మనకు వీలైనంత వరకు మేలు చెయ్యాలనే విషయాన్ని తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది.ఈ సినిమా చాలా బాగా రావడానికి మా నిర్మాత రమేష్ ఉడుత్తు గారే ఆయన సపోర్ట్ తో సినిమాను పూర్తి చేశాము ఈ నెల 26 న వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరోయిన్ దృవిక  మాట్లాడుతూ.. ఒక కేరళ ఆమ్మాయిని అయినా నన్ను నిర్మాతలు సొంత కుతురిలా చూసు కున్నారు. .ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్తవారు ఇండస్ట్రీ కు పరిచయం అవుతున్నారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు

చిత్ర సంగీత దర్శకుడు మాట్లాడుతూ .. నేను ఇంతకు ముందు ఒక ఆల్బమ్ చేశాను ఆ తరువాత షార్ట్ ఫిలిమ్స్ చేశాను. తరువాత  వాలాజా గారు ఈ సినిమాకు అవకాశం ఇచ్చారు. ఇది దమ్మున్న కథ ఇలాంటి మంచి సినిమా తెలుగులో రాలేదు. దర్శకుడు ఈ సినిమాను చాలా డెడికేటెడ్ తో ఏంతో ఇంట్రెస్ట్ తో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి చాలా చక్కని సినిమా తీశారు.. ఎంతో మంది సీనియర్ దర్శకుడికి మ్యూజిక్ డైరెక్టర్ కు ఉన్న అనుబంధంతో ఎన్నో చిత్రాలకొని పాటలు బిగ్ హిట్ అయ్యాయి. అలాగే మళ్ళి ఈ సినిమా ద్వారా  అలాంటి కాంబినేషన్ రిపీట్ అవుతుంది. దర్శకుడు కథను చాలా బాగా డీల్ చేశాడు. మేమంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు వలజా క్రాంతి మాట్లాడుతూ. నేనొక మనిషిని మానవత్వానికి ఎలాంటి హాని కలిరగినా నేను స్పందిస్తాను అన్న వ్యాఖ్యలు విన్న మాకు చిన్నప్పటి నుండి అవే భావాలతో పెరిగాము.అవే భావాలు ఉన్న వ్యక్తి రమేష్ ఉడుత్తు గారు.అందుకే ఆయన మాతో ట్రావెల్ చేయడానికి ముందుకు వచ్చారు.నేను ఎంతో మంది దర్శకుల ఐన్స్పిరేషన్ తోనే ఈ సినిమా చేయడం జరిగింది. కరోనా కష్ట కాలాన్ని ఎదుర్కొని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ఎంతో మంది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ గా నిలిచారు. రమేష్ ఉడుత్తు గారి నాకు అవకాశం ఇవ్వడం వల్లే నేను దర్శకుడు అయ్యాను. మా కష్టానికి రిజల్ట్ ఈ మూవీ.ఎంతో కష్టపడి చేసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని అన్నారు. మాలాంటి కొత్తవారిని బ్లెస్స్ చేయాలని అన్నారు.

నిర్మాత వలజా గౌరి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హీరో గా, దర్శకుడిగా మా ఇద్దరి అబ్బాయిలు  చేస్తున్నారు.మా వారు కూడా ఇందులో నటించడం జరిగింది.ఎన్నో కష్టాలు పడి ఈ సినిమా తీయడం జరిగింది.కొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని అన్నారు.

చిత్ర నిర్మాత రమేష్ ఉడుత్తు మాట్లాడుతూ .. గత మూడేళ్ళ క్రితం సినిమా మొదలుపెట్టాము. సినిమా తొందరగా అయిపోయినా కూడా కోవిడ్ వలన మేము ఎంతో ఇబ్బంది పడ్డాం. మేము భగత్ సింగ్ నగర్ టైటిల్ తో వస్తున్న మేము జస్టిస్ చేయగలమా అని బయపడ్డాం.క్రాంతి చాలా చక్కగా ఈ చిత్రాన్ని డీల్ చేశాడు. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ గత మూడు సంవత్స రాలుగా మాకు సపోర్ట్ గా నిలుస్తూ మా వెన్నంటే వున్నారు. వారందరికీ ధన్యవాదాలు. మేము ఈ చిత్రాన్ని థియేటర్ కనే  మూవీ చేయడం జరిగింది.ఓటిటి నుండి మాకు ఆఫర్ వచ్చినా ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రం థియేటర్ లోనే విడుదల చేయాలని ఈ నెల 26 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. ప్రేక్షకులందరూ మమ్మల్ని, మా చిత్రాన్ని ఆదరించి మా చిత్రాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నాను అన్నారు.

బిగ్ బాస్ జెస్సీ మాట్లాడుతూ.. కామన్ మ్యాన్ గా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వెళ్ళాను అంటే దానికి ముఖ్య కారణం ఆడియన్స్.ఎంతో మంది ట్యాలెంట్ ఉన్న వ్యక్తులు ఇండస్ట్రీ కు వచ్చి బిగ్ హిట్స్ ఇస్తున్నారు. అలాంటి కోవలో వస్తున్న మరో దర్శకుడు వాలజా క్రాంతి .ఇలాంటి మంచి చిత్రాలు తీసే వారిని ఎంకరేజ్ చేస్తే “భగత్ సింగ్ నగర్” వంటి మంచి సినిమాలు వస్తాయి.హీరో హీరోయిన్లు చాలా న్యాచురల్ గా నటించారు. దర్శకుడు క్రాంతి ఈ చిత్రం తో మంచి హిట్ కొట్టి పవణ్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

సందీప్ గారు మాట్లాడుతూ ..మంచి ఇంటెన్షన్ తో తీసిన “భగత్ సింగ్ నగర్” చిత్రం గొప్ప విజయం సాదించాలి.చిత్ర యూనిట్ అందరికి అల్ ద బెస్ట్ అన్నారు.

నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. ఇప్పడు జరుగుతున్న అంశాలమీద చేస్తున్న సినిమా ఇది.లవ్ సబ్జెక్టు ను కమర్షియల్ యాంగిల్ కాకుండా ఇలా తీశారు.మంచి మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ఆడియన్స్  ఎంకరేజ్  చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus