Bhagavanth Kesari Collections: ‘భగవంత్ కేసరి’ 25 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

  • November 13, 2023 / 07:47 PM IST

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల నటించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్..వంటివి సినిమా పై ఉన్న అంచనాలు పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సోగా అనిపించాయి.

అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 4వ వారంలో కూడా డీసెంట్ గా కలెక్ట్ చేసింది. ఒకసారి 25 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 19.70 cr
సీడెడ్ 12.85 cr
ఉత్తరాంధ్ర  6.30 cr
ఈస్ట్ 3.57 cr
వెస్ట్ 2.92 cr
గుంటూరు 5.45 cr
కృష్ణా 2.67 cr
నెల్లూరు 2.74 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 56.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.68 cr
ఓవర్సీస్ 7.23 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 69.11 cr (షేర్)

‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రానికి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 వారాలు పూర్తయ్యేసరికి ‘భగవంత్ కేసరి’ చిత్రం రూ.69.11(కరెక్టెడ్) కోట్ల షేర్ ను రాబట్టి… బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.8.11 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus