Bhagavanth Kesari: భగవంత్ కేసరి మూవీ ఆ స్థాయిలో కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉందా?

బాలయ్య అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 20 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బాలయ్య క్రేజ్ కు అనిల్ రావిపూడి టాలెంట్ తోడు కావడంతో ఈ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. భగవంత్ కేసరి సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి.

భగవంత్ కేసరి (Bhagavanth Kesari) బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 17వ తేదీ నుంచి మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ఏరియాలలో ఆ తేదీకన్నా ముందే ఈ సినిమా బుకింగ్స్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. భగవంత్ కేసరి సినిమా తన శైలికి భిన్నంగా ఉంటుందని అనిల్ రావిపూడి వెల్లడించారు. ఈ సినిమా ఒక విధంగా ప్రయోగాత్మక సినిమా అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. సాహో గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల దిశగా ఈ నిర్మాతలు అడుగులు వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనిల్ రావిపూడి సీనియర్ హీరోలందరితో సినిమాలు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

బాలయ్య శ్రీలీల కాంబో సీన్లు హృదయానికి హత్తుకునేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. బాలయ్య ఫ్లాష్ బ్యాక్ వేరే లెవెల్ లో ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. భగవంత్ కేసరి సినిమాలో అలనాటి నటి జయచిత్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలయ్య సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus