నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల కనిపించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్..వంటివి సినిమా పై అంచనాలను పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సోగా అనిపించాయి.
ఇక అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 4.07 cr |
సీడెడ్ | 2.71 cr |
ఉత్తరాంధ్ర | 1.20 cr |
ఈస్ట్ | 0.84 cr |
వెస్ట్ | 0.95 cr |
గుంటూరు | 0.75 cr |
కృష్ణా | 3.06 cr |
నెల్లూరు | 0.62 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 14.20 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.75 cr |
ఓవర్సీస్ | 3.15 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 18.10 cr (షేర్) |
‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రానికి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక మొదటి రోజు ‘భగవంత్ కేసరి’ చిత్రం రూ.18.1 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.42.9 కోట్ల షేర్ ను రాబట్టాలి.
దసరా సెలవులు కూడా ఉండటంతో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ పోటీగా ‘లియో’ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు కూడా ఉండడం.. కొంచెం టఫ్ టాస్క్ అని చెప్పాలి.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!