Bhagavanth Kesari: భగవంత్ కేసరి మూవీలో షాకింగ్ ట్విస్ట్ ఇదేనా.. ఆ సీన్లు హైలెట్ కానున్నాయా?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ భగవంత్ కేసరి రిలీజ్ కు మరో 78 రోజుల సమయం మాత్రమే ఉంది. నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు చాలా సమయం ఉన్నా ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాలు రివీల్ అవుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో శ్రీలీల పాత్రను చంపేస్తారని సమాచారం అందుతోంది.

సినిమాకు (Bhagavanth Kesari) ఈ ట్విస్ట్ హైలెట్ కానుందని శ్రీలీల పాత్ర చనిపోయే ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది. భగవంత్ కేసరి సినిమాకు సంబంధించి రివీల్ అవుతున్న ఈ విషయాలు నిజమో కాదో తెలియాలంటే మాత్రం ఈ సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. శ్రీలీల పాత్రను చంపేయడం అంటే అభిమానులకు ఒక విధంగా షాకేనని చెప్పాలి. బాలయ్య శ్రీలీల కాంబినేషన్ సీన్లు అద్భుతంగా వచ్చాయని ఈ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య కోరుకున్న భారీ హిట్ ను ఈ సినిమా అందిస్తుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తారని అభిమానులు ఫీలవుతున్నారు. అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రమోషన్స్ ను సరికొత్తగా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

బాలయ్య అనిల్ కాంబో మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ షేక్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా దసరా పండుగ విజేతగా ఈ సినిమా నిలుస్తుందేమో చూడాలి. బాలయ్య సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus