Bhagavanth Kesari: భగవంత్ కేసరి ఆ ఛానల్ లో ప్రసారమయ్యేది అప్పుడేనా.. ఫ్యాన్స్ కు శుభవార్తేగా!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్యకు సినీ కెరీర్ పరంగా లక్ ఒకింత కలిసొస్తుండటం గమనార్హం. ఈ సినిమా నవంబర్ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ఈ సినిమా ఓటీటీ డేట్ గురించి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు ఈ సినిమా సంక్రాంతి కానుకగా బుల్లితెరపై ప్రసారం కానుందని తెలుస్తోంది.

ఓటీటీలో విడుదలైన నెలరోజులకు అటూఇటుగా బుల్లితెరపై ఈ సినిమా ప్రసారం అయ్యేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. దాదాపుగా అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా ఫుల్ రన్ లో ఈ సినిమా అందించే లాభాలు 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా బుల్లితెరపై ఈ సినిమా మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే (Bhagavanth Kesari) భగవంత్ కేసరి సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది. స్టార్ హీరోయిన్ శ్రీలీల కెరీర్ లో ఈ సినిమా మెమరబుల్ సినిమాగా మిగలడం గమనార్హం. థమన్ మ్యూజిక్ బాలయ్య సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తోంది. బాలయ్య బాబీ కాంబో మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికవుతారో లేక థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికవుతారో చూడాల్సి ఉంది.

బాలయ్యతో సినిమాలు తీసే దర్శకుల జాబితాలో బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, పూరీ జగన్నాథ్, సుకుమార్ మరి కొందరి పేర్లు వినిపిస్తుండగా ఈ ప్రాజెక్ట్ లలో ఏ ప్రాజెక్ట్ మొదట మొదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus