Bhagavanth Kesari: ఫ్రీగా సినిమా చూసే ఛాన్స్.. కానీ వారికి మాత్రమే అంట..!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, టాలీవుడ్ క్రష్ శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. డే 1నుంచే భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. బాలయ్య బాబును మాస్ కా బాస్ లా చూపిస్తుంటారు డైరెక్టర్లు. కానీ ఈ సినిమాలో బాలకృష్ణను అనిల్ సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.

ఒక మంచి మెసేజ్ తో పాటు తండ్రి – కూతుర్ల మధ్య బాండింగ్ గురించి కూడా తెలియజేయడంతో సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీసు వద్ద 33 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు అందించారు. ఈ మూవీలో ఓ మంచి మెసేజ్ ఉంది.

గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు చెప్పాలని, మహిళలే కదా అని తక్కువగా చూడవద్దని వాళ్లు కూడా స్ట్రాంగ్ అని చూపించారు. ఇలాంటి డైలాగులను బాలయ్యతో చెప్పించడంతో చాలామంది చిత్ర బృందాన్ని పొగిడేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సినిమాలో ఉన్న మంచి మెసేజ్ ను పిల్లలకు చేరవేయాలని మూవీ మేకర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

స్కూలో చదువుకుంటున్న ఆడపిల్లలు అందరికీ ఈ మెసేజ్ తీసుకెళ్లాలని భగవంత్ కేసరి టీమ్ భావించినట్లు సమాచారం. త్వరలోనే స్కూల్ పిల్లలకు ఫ్రీగా సినిమా వేయబోతున్నట్లు అందుకు సంబంధించి చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ చిత్ర (Bhagavanth Kesari) బృందాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus