సినిమా ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎలా ఉంటుందో అంచనా వేయటం ఎవరి తరం కాదు. ఎందుకు అంటే ఒక్కోసారి విభిన్నమైన పాత్రలలో నటించకపోయిన , ఎక్కువ అందం లేకపోయినా వారు నటించిన సినిమాలు హిట్ అవ్వటం వల్ల ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతారు కొందరు హీరోయిన్స్. ఇది ఇలా ఉంటే మరి కొందరు హీరోయిన్స్ కి అందం, అభినయం ఉన్నా కూడా, మంచి మంచి పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చినా కూడా కాలం కలిసి రాక రేస్ లో వెనక పడిపోతుంటారు. ఈ కోవకే చెందుతుంది అందాల బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే.
రవితేజ హీరోగా , గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ మూవీ ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఆ మూవీలో తన అందంతో కుర్రకారు హృదయాలను దోచేసింది భాగ్యశ్రీ. ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా భాగ్య శ్రీ అందానికి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన రావటంతో వరుస సినిమా ఆఫర్లు తన తలుపు తట్టాయి. అదే ఊపులో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండహీరోగా కింగ్డమ్ మూవీ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ బ్యూటీ. రిలీజ్ కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసిన ఆ మూవీ చివరికి డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది.
దీంతో భాగ్యశ్రీ ఐరన్ లెగ్ గా మిగిలిపోతుందేమో అని అనుకుంటున్న సమయంలో, దుల్కర్ సల్మాన్ “కాంత” రిలీజ్ అయింది. కాంత కూడా నిరాశపరచటంతో భాగ్యశ్రీ ఆశలన్నీ ఇప్పడు రామ్ “ఆంధ్ర కింగ్ తాలూకా” మూవీపైనే పెట్టుకుంది. అయితే కాంత ఈవెంట్ లో రానా మాట్లాడుతూ భాగ్య శ్రీ ని హీరోయిన్ గా మొదట సెలెక్ట్ చేసింది మేమే అని కానీ సినిమా అనుకున్న దానికంటే లేట్ గా రిలీజ్ అవ్వటంతో మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చింది అని అన్నారు.