Acharya Songs: హుషారేత్తిస్తున్న ‘ఆచార్య’ 4వ పాట..తండ్రీకొడుకుల డ్యాన్స్ మూమెంట్స్ కూడా అదుర్స్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీ. ఈ క్రమంలో ప్రమోషన్ల జోరు పెంచాలని చిత్ర బృందం డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా ఆల్రెడీ ట్రైలర్ ను విడుదల చేసారు. దానికి సూపర్ రెస్పాన్స్ లభించడమే కాకుండా సినిమా పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.అలాగే మూడు పాటలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి.

Click Here To Watch NOW

ఇప్పుడు ‘భ‌లే భ‌లే బంజారా’ అనే పాటని కూడా విడుదల చేశారు. అన్ని పాటల కంటే ఈ పాటకి కొంచెం ఎక్కువ సందడే చేసింది ‘ఆచార్య’ బృందం. ఎందుకంటే ఈ పాటలో చిరు, రాంచరణ్ లు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి..! ప్రోమో కూడా ఈ పాట చార్ట్ బస్టర్ అవుతుందనే హింట్ ముందుగానే ఇచ్చేసింది. ఇక ఫుల్ సాంగ్ తాజాగా రిలీజ్ అయ్యింది. రామ‌జోగ‌య్య‌శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటని లెజెండరీ సింగర్ అయిన శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, టాలీవుడ్ స్టార్ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ లు ఆలపించారు.

మణిశర్మ సాంగ్స్ అన్నీ స్లో పాయిజన్ మాదిరి ఎక్కుతూ ఉంటాయి. అయితే మెగా ఫ్యామిలీ సినిమాల కోసం పనిచేసేప్పుడు ఆయన ప్రత్యేక శ్రద్ద పెడుతుంటారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అది నిజం అనే అనుమానాలను ఈ పాట మరింతగా రెట్టింపు చేసింది. థియేటర్లలో ఈ పాట అందరినీ స్టెప్పులేయించడం గ్యారెంటీ. ఈ పాట హుషారెత్తించే విధంగానే ఉంది.అక్కడక్కడ కనిపించిన విజువల్స్ ను బట్టి చిరు గ్రేస్, చరణ్ ఎనర్జీ దేనికదే సూపర్ అనిపించాయి. ఈ పాటని మీరు కూడా ఓ సారి వినండి :

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus