రాజమౌళి గురించి ఆసక్తికర విషయం చెప్పిన భానుచందర్

శాంతి నివాసం అనే సీరియల్ కి తొలిసారి మెగాఫోన్ అందుకున్న రాజమౌళి.. ఆ తర్వాత స్టూడెంట్ నెం.1 చిత్రంతో దర్శకుడిగా మారారు. సినిమాకి సినిమాకి బడ్జెట్ ని, కలక్షన్స్ ని పెంచుకుంటూ పోతున్నారు. అలాగే తాను కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలోనే టాప్ డైరక్టర్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఇలా రాజమౌళి గొప్ప దర్శకుడు అవుతాడని సింహాద్రి సినిమా సమయంలోనే చెప్పానని సీనియర్ హీరో భాను చందర్ వెల్లడించారు. ఈయన రాజమౌళి డైరక్ట్ చేసిన సింహాద్రి, యమదొంగ సినిమాల్లో నటించారు. అలనాటి సంగతిని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో భాను చందర్ వివరించారు. ” సింహాద్రి చిత్రం డబ్బింగ్ పూర్తయ్యాక రాజమౌళిని రమ్మని అడిగాను.

“ఏంటి సార్ పిలిచారట” అని రాజమౌళి అడిగారు. అతనితో మీరు సెన్సేషనల్ దర్శకులు అవుతారు. ఆ రోజు నేను మీకు ఫోన్ చేస్తా. కానీ మీరు నా ఫోన్ కి కూడా దొరకరు ” అని అప్పుడు చెప్పిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే మాదిరిగా ఇప్పటికీ రాజమౌళి అందరితో కలిసి ఉంటారు. అతని సినిమాలు ఎన్నో అవార్డులు అందుకున్నప్పటికీ గర్వం కొంచెం కూడా కనిపించదు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ చేయడానికి జక్కన్న స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus