Bharateeyudu2: 8000 మందితో ‘భారతీయుడు’ భారీ ప్లాన్… శంకర్‌ ఏం చేస్తున్నారంటే?

శంకర్‌ ఏ సినిమా చేసినా భారీగానే ఉంటుంది. అందుకే ఆయన్ను భారీ సినిమాల దర్శకుడు అని అంటారు. సగటు సన్నివేశాన్ని కూడా ఆయన ఎంతో ఉన్నతంగా కనిపించేలా సెట్స్‌, జనాలు, హంగామా ఉండేలా చూసుకుంటారు. అయితే ఆ ప్రభావం కచ్చితంగా సినిమా మీద పడుతుంది అని చెప్పొచ్చు. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న సినిమా ‘భారతీయుడు 2’లో కూడా ఇలాంటి ఓ సన్నివేశం ఉందట. ఆ సీన్‌ విజయవాడలోనే తెరకెక్కిస్తారు అని చెబుతున్నారు.

కమల్ హాసన్ హీరోగా శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. అదే తెలుగులో ‘భారతీయుడు 2’గా వస్తోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే శంకర్‌ దేశంలో, విదేశాల్లో వివిద ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు విజయవాడలో ఓ క్రేజీ సీక్వెన్స్ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. దీని కోసం విజయవాడ గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారట. ఈ షూట్‌లో ఏకంగా 8,000 జూనియర్ ఆర్టిస్టులు నటిస్తారట.

ఆ సన్నివేశం కోసం నాలుగు రోజులు అందరినీ అక్కడే బ్లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అంతమందితో ఏం చేయబోతున్నారు అనేది తెలియడం లేదు. అలాగే ఇది బహిరంగ సభ సన్నివేశం అని ఓ టాక్‌ కూడా బయట ఉంది. అయితే దర్శకుడు శంక్‌ మాత్రం అస్సలు లీక్‌ కాకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వర్క్‌ శరవేగంగా జరుగుతోంద అని చెబుతున్నారు. తొలుత ఈ సన్నివేశాన్ని హైదరాబాద్‌లో తెరకెక్కిస్తారని వార్తలొచ్చాయి. అయితే ఎన్నికల కోడ్, తదితర పరిస్థితుల వల్ల అవ్వలేదు.

ఇక ఈ సినిమా (Bharateeyudu2) సంగతికొస్తే చాలా నెలల క్రితమే మొదలైన ఈ సినిమా అనుకోని పరిస్థితుల్లో ఆగిపోయింది. దీంతో కమల్ బాగా డీలా పడ్డారు. ఆ తర్వాత కోలుకొని ఇప్పుడు మునపటి వేగంతో వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నరు. త్వరలో మరికొన్ని సినిమాల అనౌన్స్‌మెంట్ ఉంది అని అంటున్నారు. అలా ఎప్పుడో ఆగిన ‘భారతీయుడు 2’ గురించి దర్శకుడితో మాట్లాడి ముందుకు తీసుకొచ్చారు కమల్‌ హాసన్‌.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus