Pawan Kalyan,Bharath Reddy: పవన్ కళ్యాణ్ పై నటుడు భరత్ రెడ్డి ఊహించని కామెంట్స్..వైరలవుతున్న పాత వీడియో!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని ఇంట్రొడక్షన్లు ఇచ్చినా చదువుతున్న మీకు రాసిన నాకు శాటిస్ఫై అవ్వలేము. పవన్ కళ్యాణ్ గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి. ఆయన గురించి ఇండస్ట్రీలో జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి .. ఆయన గురించి గొప్పగా ఏమైనా వినిపిస్తే వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టేసుకోవాలి. ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే చాలామంది తొందరగా డైజెస్ట్ చేసుకోలేరు.

గతంలో ఇలాంటి సంఘటనలు చాలా చూసాము. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న జర్నలిస్ట్ లు కానీ, ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్లు కానీ అడ్రస్ లేకుండా పోయారు. ఈ నెగిటివ్స్ అనేవి పక్కన పెట్టేస్తే ఓ వ్యక్తి అందరికీ నచ్చాలి అనేమీ లేదు. ఎవరికైనా సెల్ఫ్ ఒపీనియన్ అనేది ఉంటుంది. అది వ్యక్తపరచడంలో తప్పేమి లేదు. సరిగ్గా ఇలాగే ఓ సందర్భంలో నటుడు భరత్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ పై ఊహించని కామెంట్స్ చేశాడు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతనికి పవన్ కళ్యాణ్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ‘మీరు ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించారు కదా. ఆయన బయట ఎలా ఉంటారు లోపల ఎలా ఉంటారు?’ అంటూ యాంకర్ భరత్ ను ప్రశ్నించాడు. దీనికి భరత్ బదులిస్తూ.. “అతను లోపల ఎలా ఉంటాడో బయట ఎలా ఉంటాడో నాకు తెలీదు.

కానీ అతని పై నాకు గొప్ప ఇంప్రెషన్ ఏమీ లేదు. అతనితో నాకు ఉన్న అసోసియేషన్ ను బట్టి.. నాకు పెద్దగా అతని పై ఇంప్రెషన్ లేదు. అతను నన్ను ఏదైతే తిట్టాలి అనుకుంటాడో అవి సినిమాలో డైలాగులుగా పెట్టుకుంటాడు. ఎదుటివాళ్ళ గురించి అతను ఆలోచించే విధానం అది. అందుకే అతని పై నాకు పెద్దగా ఇంప్రెషన్ లేదు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇది పాత వీడియోనే అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus