ఆ బయోపిక్ బయోపిక్ లో నటించొద్దు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ‘800’ అనే సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి వివాదాలు అతడిని చుట్టుముట్టాయి. ప్రముఖ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఆధారణంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో ఈ బయోపిక్ ని వదిలేయాలంటూ తమిళ సంఘాలు విజయ్ సేతుపతిని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ జరిగింది. నేషనల్ వైడ్ గా ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అనే ట్యాగ్ ని ట్రెండ్ చేశారు. తాజాగా సీనియర్ దర్శకుడు భారతీరాజా ఈ విషయంపై స్పందించారు.

‘800’ చిత్రంలో నటించొద్దని విజయ్‌సేతుపతికి హితవు పలుకుతూ గురువారం ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు భారతీరాజా. అందులో శ్రీలంక మతవాదనకి పూర్తిగా మద్దతు పలికిన వ్యక్తి ముత్తయ్య మురళీధరన్‌ అని పేర్కొన్నారు. ముత్తయ్య మురళీధరన్‌ నమ్మకద్రోహి అని.. అటువంటి వ్యక్తి బయోపిక్ లో నటించడం కరెక్ట్ కాదని అన్నారు. ఆ బయోపిక్ వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. కెరీర్ ఫై కుడి ప్రభావం చూపే అవకాశం ఉందంటూ విజయ్ సేతుపతికి వార్నింగ్ ఇచ్చారు.

భారతీరాజా చెప్పిన విధంగానే.. దర్శకుడు శీను రామస్వామి, చేరన్‌ కూడా ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్రలో నటించొద్దని విజయ్‌సేతుపతికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెస్ శ్రీపతి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ని ఇండియా, ఆస్ట్రేలియా దేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ముసురుకున్న వివాదంతో అసలు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఈ విషయంలో చిత్రబృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus