ఆ క్రేజీ హీరో చెల్లెలు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందట..!

  • June 12, 2019 / 04:29 PM IST

బాలీవుడ్ లో తప్ప మరే ఇండస్ట్రీలోనూ హీరోల కుటుంబ సభ్యుల నుండీ హీరోయిన్లుగా నటించడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు. అయితే ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీలో కూడా ఈ పద్ధతి విస్తరించనుంది. టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ లో కూడా పలు విజయవంతమైన సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసి ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు జి.వి.ప్రకాష్ కుమార్. ఈయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ కు మేనల్లుడు. ఇక జి.వి. ప్రకాష్ కుమార్ సోదరి ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యిందని సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం.. జి.వి. ప్రకాష్ కుమార్ చెల్లెలు భవానిశ్రీ హీరోయిన్ గా వెండితెరకి పరిచయం కాబోతుందట. దర్శకుడు విరుమాండి కోలీవుడ్లో విజయ్ సేతుపతి హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు.. అయితే మరో హీరోయిన్ గా భవానీశ్రీని కూడా ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తమిళ్ తో పాటూ తెలుగులో కూడా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేస్తారని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus