Bheemla Nayak Trailer: ‘నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..’ ట్రైలర్ మాములుగా లేదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా ‘భీమ్లానాయక్’. సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా భార్య పాత్రలో సంయుక్త మీనన్ కనిపించనుంది. ఈ నెల ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేయనున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

‘ఏంటి బాలాజీ స్పీడ్ పెంచావ్..?’ అంటూ రానా తన డ్రైవర్ ని ప్రశ్నించే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. రానా, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్లను పరిచయం చేసే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ ని ఎలివేట్ చేసిన సన్నివేశాలు మాములుగా లేవు. ‘నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ’ అంటూ రానా చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ‘నీ ఇవతల ఉంటేనే చట్టం.. అవతలకొస్తే కష్టం.. వాడికి’ అంటూ పవన్ చెప్పే డైలాగ్ మరో హైలైట్. ట్రైలర్ చివర్లో పవన్, రానా తలపడే సన్నివేశాలు ఫ్యాన్స్ కి మాసివ్ ట్రీట్ అనే చెప్పాలి.

తమన్‌ అందించిన పాటలు ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్‌ అయ్యాయి. అలానే రానా, పవన్ పాత్రలకు సంబంధించిన టీజర్స్ కి అద్భుతమైన హైప్ వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఉన్నది ఉన్నట్లుగా తీయకుండా.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈరోజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాల్సింది కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. మరో రెండు రోజుల్లో ప్రీరిలీజ్ ఫంక్షన జరగనుందని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా సంస్థలు సంయుక్తంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికోసం భారీ ధరను ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus