Bheemla Nayak OTT: ‘ఆర్.ఆర్.ఆర్’ వల్ల ఒక్క రోజు ముందే వచ్చేస్తున్నాడా?

  • March 22, 2022 / 08:23 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దగ్గుబాటి రానా కలయికలో తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లేని అందించాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ఇక్కడ చాలా మార్పులు చేశారు.

Click Here To Watch NEW Trailer

అవి సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ కు రానా ఆటిట్యూట్ కు మాస్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ‘భీమ్లా’ డిజిటల్ ప్రీమియర్ మార్చి 25న ‘ఆహా’ లో స్ట్రీమ్ కానున్నట్టు ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్క రోజు ముందుగా అంటే ఫిబ్రవరి 24నే డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటించి సర్ప్రైజ్ చేశారు. మార్చి 25న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది.

అదే రోజున ‘భీమ్లా’ ని కనుక విడుదల చేస్తే ‘ఆర్.ఆర్.ఆర్’ ఓపెనింగ్స్ పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉండనే ఉంది. అందు కోసమే ఒక్క రోజు ముందుగా ‘భీమ్లా’ ని రంగంలోకి దింపుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇక విభిన్నమైన కంటెంట్ తో తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది ‘ఆహా’. ప్రతీ శుక్రవారం ఓ కొత్త సినిమాని విడుదల చేసి అభిమానుల్ని అలరిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ సందడి ఓ రోజు ముందు నుండే మొదలుపెట్టినట్టు స్పష్టమవుతుంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus