ఇక భీమా ట్రైలర్ విషయానికి వస్తే .. ఇది 2 నిమిషాల 32 సెకండ్ల నిడివి కలిగి ఉంది. కొంచెం మైతాలజీ యాంగిల్ ను టచ్ చేస్తూ ట్రైలర్ మొదలైంది అని చెప్పాలి. ఒక నిమిషం 20 సెకండ్ల వరకు హీరో కనిపించలేదు. ప్రభాస్ ‘సలార్’ మొదటి ట్రైలర్ విషయంలో కూడా ఇలాంటి పోలికని గమనించ వచ్చు. ఇక గోపీచంద్ ను పరశురాముడుతో పోలుస్తూ డైలాగ్స్ ఉన్నాయి. రెండు వైవిధ్యమైన పాత్రల్లో గోపీచంద్ కనిపిస్తున్నాడు.
ఒక లుక్ లో పోలీస్ గా , ఇంకో లుక్ లో లాంగ్ హెయిర్ తో ఓల్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి.’ నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊళ్లో శ్మశానం కూడా సరిపోదు నా కొడకా..!’ అనే డైలాగ్ హైలెట్ గా ఉంది. మొత్తంగా ‘భీమా’ (Bhimaa) బాగానే ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి:
సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!