Bhola Shankar: మెహర్ రమేష్ తప్పేంటన్న ప్రముఖ ఎడిటర్.. నాలుగు హిట్లు అంటూ?

భోళా శంకర్ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడం మెగా ఫ్యాన్స్ ను ఎంతగానో బాధపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మార్నింగ్ షో కూడా పూర్తి కాకముందే ఈ సినిమాకు సంబంధించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడం గమనార్హం. అయితే ఈ సినిమాకు ప్రముఖ ఎడిటర్లలో ఒకరైన మార్తాండ్ కే వెంకటేశ్ పని చేశారు. తాజాగా మార్తాండ్ కే వెంకటేశ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భోళా శంకర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

భోళా శంకర్ (Bhola Shankar) మూవీ అబవ్ యావరేజ్ అవుతుందని అనుకున్నానని అయితే ఈ సినిమా విషయంలో అంచనా తప్పిందని ఆయన కామెంట్లు చేశారు. ఆరెంజ్ మూవీ విషయంలో నా అంచనా తప్పైందని ఆ తర్వాత నా అంచనా రాంగ్ కావడం భోళా శంకర్ విషయంలోనే జరిగిందని ఆయన తెలిపారు. భోళా శంకర్ మూవీ బాగాలేదని చూడలేదని తనతో చాలామంది చెప్పారని మార్తాండ్ కే వెంకటేశ్ అన్నారు.

ఆ సినిమాపై ఊహించని స్థాయిలో ట్రోల్స్ ఎందుకు చేశారో అర్థం కాదని ఆయన తెలిపారు. మెహర్ రమేశ్ కన్నడలో తీసిన సినిమాలు సక్సెస్ అయ్యాయని తెలుగులో తీసిన బిల్లా, కంత్రి కూడా హిట్ అయ్యాయని శక్తి, షాడో సినిమాలు ఫ్లాపైనంత మాత్రాన మెహర్ రమేష్ పై అంత దారుణంగా ట్రోల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మార్తాండ్ కే వెంకటేశ్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మార్తాండ్ కే వెంకటేశ్ చేసిన కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎన్నో హిట్ సినిమాలకు మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటర్ గా పని చేశారు. చేతినిండా వరుస ఆఫర్లతో మార్తాండ్ కె వెంకటేశ్ బిజీగా ఉన్నారు. ఈ ఎడిటర్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉంది. మార్తాండ్ కే వెంకటేశ్ కు మరిన్ని విజయాలు దక్కాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus