Bhola Shankar: చరణ్‌ పేరుతో చిరు సినిమాకు ప్రమోషన్‌… చిరుకి ఆనందం.. ట్రోలర్స్‌కి సంతోషం!

కొడుకు పేరు చెప్పి… తండ్రి గురించి చెప్పడం గురించి విన్నారా? ఇలాంటి చాలా తక్కువ జరుగుతాయి కానీ.. జరిగేటప్పుడు చూస్తే వావ్‌ అనిపిస్తుంది. అయితే తండ్రి గొప్పతనాన్ని కొడుకు పేరుతో చెప్పడం కాస్త ఇబ్బందికరంగానూ ఉండొచ్చు. కానీ ఆ తండ్రి ఆనందపడతారు కూడా. సింపుల్‌గా చెప్పాలంటే ‘ఫలానా అబ్బాయి తండ్రి ఈయన’ అని చెప్పడం అన్నమాట. మీకు ఈజీగా అర్థం కావాలంటే ప్రముఖ రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్‌ను ఇప్పుడు చాలామంది రాజమౌళి తండ్రి అని అంటున్నారు కదా అలా అన్నమాట.

ఆ మాటలు వింటున్నప్పుడు విజయేంద్ర ప్రసాద్‌ పొంగిపోతుంటారు కూడా. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితే వచ్చింది మెగాస్టార్‌ చిరంజీవికి. అవును (Bhola Shankar) ‘భోళా శంకర్‌’ సినిమా విడుదల సందర్భంగా ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ కాదు.. బాలీవుడ్‌లో. తెలుగులో ఇటీవల వచ్చిన సినిమాను బాలీవుడ్‌లో డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఇటీవల సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ క్రమంలో హిందీనాట పోస్టర్లు, హోర్డింగ్‌లు కనిపిస్తున్నాయి. అందులో ‘చిరంజీవి ఫాదర్‌ ఆఫ్‌ ‘ఆర్‌ఆర్ఆర్‌’ రామ్‌చరణ్‌’ అని రాసి ఉంది.

దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇప్పటికే హిందీ సినిమాలు చేసి బాలీవుడ్‌లో పరిచయం ఉన్న చిరంజీవి గురించి ఇలా రాసేసరికి ‘ఎందుకిలా’ అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం తెలుసు కానీ.. ఇలా కాయలు పేరు చెప్పుకొని చెట్టును అమ్ముకోవడం ఏంటి అంటున్నారు. అయితే రీసెంట్‌గా ‘ఆర్ఆర్‌ఆర్‌’ పాన్‌ ఇండియా హిట్‌ కావడం, ఇప్పటి బాలీవుడ్‌ ప్రేక్షక తరానికి చిరంజీవి తెలియకపోవడం వల్లే అలా రాశారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

ఆగస్ట్ 25న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో చిరు పాత్రకు ఆయన స్నేహితుడు, ప్రముఖ హిందీ నటుడు జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పారు దుల్కర్ సల్మాన్ ‘కింగ్ అఫ్ కోథ’, ఆయుష్మాన్ ఖురానా ‘డ్రీమ్‌ గర్ల్ 2’ పోటీలో ‘భోళా..’ ఏం చేస్తాడో చూడాలి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus