Chiranjeevi: ‘భోళా శంకర్‌’ టీమ్‌ నుండి లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చేసింది!

చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో చాలా తక్కువ హైప్‌ ఉన్న సినిమాల్లో ‘భోళా శంకర్‌’ ఒకటి. అంతేకాదు అత్యధిక పుకార్లు వస్తున్న సినిమా కూడా ఇదే. సినిమా ఉంది, లేదు అంటూ కొన్ని రోజులు… ఆగిపోయింది, ఆగలేదు అంటూ ఇంకొన్ని రోజులు పుకార్లు వస్తున్నాయి. అయితే ఇటీవల చిత్రబృందం ఈ విషయంలో ఫుల్‌ క్లారిటీ ఇచ్చింది. త్వరలో సినిమా షూట్‌ స్టార్ట్‌ చేస్తాం అని చెప్పింది. అనుకున్నట్లుగా సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది.

మంగళవారం నుండి ‘భోళా శంకర్’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది. అది కూడా మామూలుగా కాదు ‘శంకర్‌’ని స్టైలిష్‌ యాక్షన్‌ సీన్స్‌లో చూపిండచానికి సిద్ధమైంది. ఈ మేరకు ‘భోళా శంకర్‌’ టీమ్‌ సోమవారం సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. అందులో రెండు ఫొటోలు ఉన్నాయి. దర్శకుడు మెహర్‌ రమేశ్‌, ఫైట్‌ మాస్టర్లు రామ్‌ – లక్ష్మణ్‌ అండ్‌ టీమ్‌ను ఆ ఫొటోల్లో చూడొచ్చు. చిరంజీవి, నటుడు షావరాలీ తదితరుల మీద ఈ యాక్షన్‌ సీన్స్‌ ఉండనున్నట్లు సమాచారం.

షేర్‌ చేసిన ఫొటోల బ్యాగ్రౌండ్‌లో పెద్ద సెటప్, ప్రైవేట్ బస్సులు కనిపిస్తున్నాయి. కాంప్లెక్స్ సెట్స్‌లో ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వేదాళం’ సినిమాకి రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇది మూడో షెడ్యూల్‌. రెండు షెడ్యూల్స్‌లో సుమారు 40 శాతం షూటింగ్ పూర్తి చేశారట.

‘భోళా శంకర్‌’లో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోంది. చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతీ స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు చిరంజీవి నుండి ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా విడుదలవుతుంది. మరోవైపు బాబీ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ చిత్రీకరణ కూడా జరుగుతోంది. ఈ లెక్క వచ్చే ఏడాది రెండు సినిమాలు చిరంజీవి నుండి పక్కా.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus