ఎన్టీఆర్, పవన్, మహేష్ ల గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన భూమిక

భూమిక తొలి అడుగు యువకుడితో హిట్ కొట్టలేకయినప్పటికీ మలిఅడుగు ఖుషీతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఒక్కడు, సింహాద్రి సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయారు. హీరోయిన్ గా అవకాశాలు వస్తున్న సమయంలోనే యోగా గురు భరత్ ఠాకూర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. బాలీవుడ్‌ మూవీ ఎంఎస్ ధోని చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రి ఇచ్చారు. తెలుగులో నాని ఎంసీఏ చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలెట్టారు. ఈ సారి మొదటి అడుగు విజయాన్ని అందించింది. నాని వదినగా ఎక్కువ మార్కులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా పలకరించిగా ఆసక్తికర సంగతులు చెప్పారు. “ఎంసీఏతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ నాకు సంతృప్తి లభించింది. ఈ చిత్రంలో నాని పాత్రకు, నేను పోషించిన జ్యోతి పాత్రకు మంచి స్పందన వస్తున్నందుకు ఆనందంగా ఉంది” అన్నారు. తాను నటించిన హీరోల గురించి మాట్లాడుతూ.. ” వెంకటేష్‌కు అధ్యాత్మికత ఎక్కువ.

నాగార్జున చార్మింగ్. చిరంజీవి పవర్‌ఫుల్, ఎన్టీఆర్‌ది చిన్నపిల్లల మనస్తత్వం, చాలా ఫన్నీగా ఉంటాడు. మహేశ్‌బాబు సైలెంట్‌గా కనిపించినప్పటికీ.. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. పవన్ కల్యాణ్‌ ఓ సెన్సిబుల్ వ్యక్తి” అని వివరించారు. ఇంకా తనకి ఇష్టపమైన రోల్ ఖుషీలోని మధు అని చెప్పారు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలో నటించడానికి ఒకే చెబుతారా ? అన్న ప్రసన్నకు భూమిక బదులిస్తూ.. “పవన్, మహేశ్, ఎన్టీఆర్‌తో సినిమాలు చేయడానికి ఇష్టమే. హీరోయిన్‌గా నేను చేయలేను. అలా అని 60 ఏళ్ల పాత్రలు కూడా చేయలేను. స్క్రిప్ట్‌ను బట్టి నేను వాళ్లతో నటించే పరిస్థితి ఆధారపడి ఉంటుంది” అని స్పష్టం చేశారు.

https://www.youtube.com/watch?v=alr8iR3Sm0U

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus