Pushpa 2: ‘పుష్ప2’.. అనుకున్న టైంకి షూటింగ్ అవుతుందా..?

ఇటీవలే ‘పుష్ప2’ షూటింగ్ మొదలైంది. అంతకముందు అల్లు అర్జున్ మీద స్టూడియోస్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత బన్నీ లేకుండా కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. ఇదంతా టీజర్ కోసం ప్లాన్ చేశారు. కానీ ఆఖరి నిమిషంలో టీజర్ రిలీజ్ చేయకుండా సైలెంట్ అయిపోయారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే బన్నీ ‘పుష్ప2’ టీజర్ ‘అవతార్ 2’ సినిమాతో పాటు థియేటర్లలో ప్లే అవ్వాల్సింది. కానీ అలా జరగలేదు.

రీసెంట్ గా హైదరాబాద్ లో నాలుగు రోజుల పాటు షూటింగ్ జరిగిన తరువాత చిత్రబృందం మళ్లీ బ్రేక్ తీసుకుంది. రెండు, మూడు రోజులు కాకుండా దాదాపు ఇరవై రోజులపైనే బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ ను జనవరిలో మొదలుపెట్టాలని చూస్తున్నారు. జనవరి 8 లేదా 9 నుంచి ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు. అది కూడా అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుందా..? లేదా..? అనేది సందేహమే.

ఎందుకంటే ఇప్పటికీ దర్శకుడు సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తూనే ఉన్నారు. బన్నీ కూడా ఈ మధ్యే సుకుమార్ లేకపోతే తనకు లైఫ్ లేదని.. అందుకే షూటింగ్ ఆలస్యమవుతున్నా.. ఏం అనలేకపోతున్నానంటూ డైలాగ్ వేశారు. దాన్ని బట్టి బన్నీ కూడా సినిమా షూటింగ్ లేట్ అవుతున్నందుకు ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘పుష్ప’ సినిమా రిలీజై ఏడాది దాటేసింది.

బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ‘పుష్ప2’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ సుకుమార్ మాత్రం ఇప్పటివరకు ఒక షెడ్యూల్ కూడా ప్రోపర్ గా పూర్తి చేయలేదు. ఇదంతా చూస్తుంటే వచ్చే ఏడాదిలో సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అనిపిస్తుంది. మరీ నాలుగు రోజులు షూటింగ్ చేసి ఇంత పెద్ద బ్రేక్ తీసుకోవడం ఏంటో సుకుమార్ కే తెలియాలి!

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus