ప్రభాస్ సినిమాకి ఈ కష్టాలేంటో..?

ఏ ముహూర్తాన ‘బాహుబలి'(సిరీస్) మొదలు పెట్టాడో కానీ.. అప్పటినుండీ ఆయన అభిమానులు ఒక్కో సినిమా కోసం రెండేసేళ్లు ఎదురు చూడాల్సి వస్తుంది. 2013 లో ‘మిర్చి’ విడుదలైన రెండేళ్లకు అంటే.. 2015 లో ‘బాహుబలి ది బిగినింగ్’ వచ్చింది. ఆ తరువాత మళ్ళీ 2017 లో ‘బాహుబలి 2’ వచ్చింది. మళ్ళీ ‘సాహో’ రావడానికి మరో రెండేళ్లు పట్టింది. గతేడాది అంటే 2019 లో ‘సాహో’ చిత్రం విడుదలైంది. అయితే ఈ సారి మాత్రం ఫాస్ట్ గా సినిమా చేసి చూపెడతాను అని చెప్పి ఫ్యాన్స్ కు మాట ఇచ్చాడు ప్రభాస్. కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు.

‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్లో తన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు ప్రభాస్. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలైంది. రెండు షెడ్యూల్స్ చక చకా పూర్తి చేసేసారు కాబట్టి ఈ ఏడాది సినిమా విడుదల కావడం గ్యారంటీ అనుకున్నారంతా..! అయితే అది కుదిరేలా లేదు. ఇప్పుడున్న పరిస్థితికి సినిమాలు మొత్తం షెడ్యూల్స్ ను మార్చుకుంటున్నాయి. ఆగష్టులో విడుదల కావాల్సిన సినిమాలు రెండేసి నెలలు వెనక్కి జరుగనున్నాయి. దాంతో అక్టోబర్ లేదా నవంబర్ లో ‘ప్రభాస్ 20’ విడుదలవుతుంది అనుకుంటే అది కుదిరేలా లేదని సమాచారం. ‘ఇక ప్రభాస్ సినిమా 2021 లో చూసుకోవాల్సిందే’ అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus