హీరోయిన్ రియాకు చుట్టుకున్న మరో కేసు..!

  • August 27, 2020 / 03:03 PM IST

రోజుకో మలుపు, పూటకో సంచలనంలా తయారైంది సుశాంత్ రాజ్ పుత్ కేసు విచారణ. సీబీఐ ఎంక్వయిరీతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతుంది. కొత్తగా ఈ కేసులో డ్రగ్స్ యాంగిల్ బయటపడింది. సుశాంత్ సింగ్ వంట మనిషిని సీబీఐ విచారణ చేయగా సుశాంత్ గంజాయి తాగేవాడని చెప్పాడు. దీనితో సుశాంత్ కేసులో డ్రగ్ మాఫియా ఇన్వాల్వ్ మెంట్ ఉందా అనే కొత్త అనుమానం మొదలైంది. ఇక సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి వాట్స్ అప్ చాట్ ని సీబీఐ పరిశీలిస్తుండగా షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి.

రియా చక్రవర్తి ఒక డ్రగ్ డీలర్ తో వాట్స్ అప్ చాట్ చేసినట్లు తెలిసింది. కొన్ని డ్రగ్స్ విషయమై రిహా జయ సాహా అనే వ్యక్తితో చాట్ చేశారు. నిషేధిత కొన్ని డ్రగ్స్ కోసం ఆమె అతనితో వాకబు చేసినట్లు వాట్స్ అప్ చాట్ ద్వారా తెలుసుకున్నారు. అలాగే ఓ డ్రగ్ ని ఎలా వాడాలో కూడా జయ సాహా వాట్స్ అప్ చాట్ లో తెలియజేశారు. వాటర్ లేదా టీ, కాపీలో నాలుగు చుక్కలు వేసి తాగితే అరగంటలో ఫుల్ కిక్ వస్తుందని అతను చెప్పడం జరిగింది.

రియా డ్రగ్ డీలర్లతో సంబంధాలు కలిగి ఉందని తెలిసిన నేపథ్యంలో నార్కోటిక్ డిపార్ట్మెంట్ రంగంలో దిగింది. వాట్స్ అప్ చాట్ ఆధారంగా రియాతో పాటు మరికొందరిని అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే సీబీఐ, ఈడీతో ఇబ్బందిపడుతున్న రియాకు కొత్త తలనొప్పి మొదలైంది.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus