సాయి పల్లవి పని అయిపొయిందా..?

‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకర్షించింది సాయి పల్లవి. ఈ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా ‘భానుమతి’ క్యారెక్టర్ తో నిజంగానే సాయి పల్లవి ఫిదా చేసింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో సాయి పల్లవికి మంచి అవకాశాలే వస్తున్నాయని చెప్పాలి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని తో ‘ఎం.సి.ఏ’, నాగ‌శౌర్య తో ‘కణం’చిత్రాలు చేసింది. ఇదిలా ఉంటే గతంలో సాయి పల్లవి పై కొన్ని రూమర్లు కూడా పెద్ద ఎత్తున హల్ చల్ చేసాయి. హీరోలకంటే కూడా తన పాత్రకే ప్రాధాన్యం ఉండాలని డిమాండ్ చేస్తూ దర్శక నిర్మాతల పై ఒత్తిడి తెస్తుందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అంతే కాదు తాను షూటింగ్ కు టైమ్ కి రాద‌ని కూడా వార్తలు వచ్చాయి. నాని,నాగ‌శౌర్య తో సినిమాలు చేస్తున్నప్పుడు.. వారితో గొడవలు కూడా పెట్టుకుందని వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటె తాజాగా సాయి ప‌ల్ల‌వి న‌టించిన రెండు చిత్రాలు విడుద‌లైయ్యాయి. హను రాఘవపూడి డైరెక్షన్లో శ‌ర్వానంద్‌తో కలిసి చేసిన ప‌డ ప‌డి లేచే మ‌న‌స్సు ఒకటి కాగా కోలీవుడ్ హీరో ధ‌నుష్‌తో మారి -2 చిత్రం ఒకటి. ఈ రెండు సినిమాల‌ పై చాలా ఆశ‌లు పెట్టుకుంది సాయి పల్లవి. అయితే ఆమె ఆశ‌ల‌న్నీ నీరు కారిపోయాయనే చెప్పాలి. ఈ రెండు చిత్రాలకీ డివైడ్ టాక్ లభించింది. ఈ రెండు చిత్రాలు కూడా అనుకున్నంత రేంజ్‌లో లేవ‌ని ప్రేక్ష‌కులు తేల్చి చెప్పేసారు. ఈ చిత్రాలు ఫెయిల్ అవ్వడం హీరోల క‌న్నా సాయి ప‌ల్ల‌వి పైనే ఎక్కువ పడే అవకాశం ఉందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తన ఆటిట్యూడ్ పై చాలా నెలకొన్న తరుణంలో ఇలా రెండు ప్లాపులు పడటం సాయి పల్లవి గట్టి దెబ్బే అని వారు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus