శ్రీదేవి కూతురికి.. టాలీవుడ్ కూడా మొహం చాటేస్తుందా?

శ్రీదేవి కూతురి సినీ రంగ ప్రవేశం ఓ రేంజ్లో ఉండాలని భావించి జాన్వీ కపూర్ ను తీసుకెళ్ళి అక్కడి బడా నిర్మాత కరణ్ జోహార్ చేతిలో పెట్టారు. నిజానికి స్టార్ ఫ్యామిలీ నుండీ వచ్చే వారసులనందరినీ ఆయనే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శ్రీదేవి కూతుర్ని కూడా ఆయనే హీరోయిన్ గా పరిచయం చేసాడు. ‘దడక్’ అనే పేరుతో రూపొందించిన చిత్రం కమర్షియల్ గా బాగానే వర్కౌట్ అయ్యింది. ముఖ్యంగా జాన్వీ కపూర్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.

అయితే శ్రీదేవి కూతురు రేంజ్ కు.. ఓ పెద్ద స్టార్ హీరో సినిమాలో నటింపచేస్తాడు అనుకుంటే.. 25 కోట్ల లోపే బడ్జెట్ కలిగిన సినిమాని రూపొందించాడు. కొన్నాళ్ళు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆమెను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవట్లేదట. నిజానికి ‘దడక్’ కంటే ముందే.. టాలీవుడ్ లో రాంచరణ్ సినిమాలో జాన్వీ కపూర్ నటీమచేయమని శ్రీదేవి అండ్ ఫ్యామిలీతో డిస్కషన్స్ జరిగాయట. కానీ ఈ ఆఫర్ చిన్నది అని భావించారో ఏమో.. ఈ ఆఫర్ ను వారు వద్దకున్నట్టు ప్రచారం జరిగింది. బాలీవుడ్లో మొదటి చిత్రం చేసాక .. ‘ గుంజన్ సక్సేనా’ బయోపిక్ లో నటించింది జాన్వీ కపూర్.

కానీ లాక్ డౌన్ వల్ల ఆ చిత్రం కాస్త ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈమె నటించే తరువాతి సినిమా కూడా ఆన్లైన్ లోనే విడుదలవుతుంది అని ప్రచారం జరుగుతుంది. దాంతో ఇప్పుడు ఈమెకు బాలీవుడ్లో పెద్ద హీరోల సినిమాల్లో తీసుకోవడానికి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తుంది.తెలుగులో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ ను కూడా ఈమె రిజెక్ట్ చేసింది. కాబట్టి ‘వకీల్ సాబ్’ తో టాలీవుడ్ కు నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న బోణి కపూర్.. పెద్ద హీరోల సినిమాల్లో జాన్వీ కపూర్ ను నటింపచేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారట. కానీ ఆ ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదని తెలుస్తుంది.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus