ఆ రకంగా చూస్తే ‘కె.జి.ఎఫ్’ కి వచ్చిన టి.ఆర్.పి ఎక్కువే..!

‘బాహుబలి'(సిరీస్) తరువాత అన్ని భాషల్లోనూ హిట్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే.. కచ్చితంగా అది ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ చిత్రమనే చెప్పాలి. ఓ కన్నడ చిత్రం ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని రిలీజ్ అయ్యే వరకూ ఎవ్వరూ ఊహించలేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో హీరో యష్ ను ఎలివేట్ చేసిన విధానం అలాగే.. రవి బస్రుర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఈ చిత్రాన్ని ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి.

ఈ చిత్రం ధియేటరికల్ పరంగానే కాకుండా.. డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన వారికి కూడా భారీ లాభాలను అందించింది. అయితే ఇటీవల ఈ చిత్రం తెలుగు ప్రీమియర్ ను టెలికాస్ట్ చెయ్యగా.. ఆశించిన స్థాయిలో టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చెయ్యలేకపోయిందనే చెప్పాలి. ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ ప్రీమియర్ ను జూలై 5న ‘స్టార్ మా’ వారు టెలికాస్ట్ చెయ్యగా.. కేవలం 11.9 టి.ఆర్.పి ని మాత్రమే నమోదు చేసింది. చెప్పాలంటే డబ్బింగ్ సినిమాకి ఇది ఎక్కువ టి.ఆర్.పి నే అని చెప్పాలి.

అందులోనూ 2018 డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదలైతే… ఇంతకాలానికి బుల్లితెర పై టెలికాస్ట్ చేశారు. అందులోనూ అమెజాన్ లో ఎన్నో సార్లు ఈ చిత్రాన్ని చూసేసారు కూడా..! అయితే ‘లాక్ డౌన్ టైం.. అందులోనూ ఆదివారం సాయంత్రం ఈ సినిమాని టెలికాస్ట్ చేసారు.. అది కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసి మరీ’.. అనే విధంగా చూస్తే ఇది తక్కువ టి.ఆర్.పి రేటింగ్ అనేది కొందరి వాదన..!

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus