సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఇద్దరూ టాలీవుడ్లో ఉన్న లీడింగ్ హీరోలు. చరణ్ ఆల్రెడీ రాజమౌళితో సినిమా చేసి గ్లోబల్ స్టార్ అయిపోయాడు. మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలు పక్కన పెడితే.. వీరు చేస్తున్న లేటెస్ట్ మూవీస్ రెండూ చిత్రీకరణ దశలో ఉన్నాయి. అవి ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటాయి అనేది మాత్రం అంచనా వేయడం కష్టంగా మారింది.
‘గేమ్ ఛేంజర్’ మూవీని శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా జరుగుతుంది. ఇక మహేష్ బాబు… త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా సంగతి కూడా అలానే ఉంది. అయితే ఈ రెండు సినిమాలకి కూడా తమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలకి సంబంధించిన ఫస్ట్ సింగిల్స్ ఈ దసరా కానుకగా రిలీజ్ అవుతాయి అని అంతా భావించారు. ముఖ్యంగా అభిమానులు అయితే ఆ పాటలని పెద్ద ఎత్తున ట్రెండ్ చేయాలని డిసైడ్ అయ్యారు.
కానీ వారికి ఊహించని షాక్ తగిలింది. అటు ‘గేమ్ ఛేంజర్’ నుండి కానీ ఇటు ‘గుంటూరు కారం’ నుండి కానీ ఎలాంటి పాటలు రిలీజ్ కావడం లేదు. నామమాత్రం దసరా శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లు వదిలే అవకాశం ఉంది అంతే..! ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా తెలీని పరిస్థితి.
అందుకే అప్పుడే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం లేదు. ఇక ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ విషయంలో చిత్ర బృందమే ఓ నిర్ణయానికి రాలేదు అని తెలుస్తుంది. దీనిని బట్టి ఆ సినిమా 2024 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లు బాగా తక్కువగానే కనిపిస్తున్నాయి.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!