టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే ఓ రేంజ్ ఉంటుంది. కనీసం 100 కోట్ల లోపు బడ్జెట్ లో తీస్తే… 150 కోట్ల వరకూ టేబుల్ ప్రాఫిట్ నిర్మాతలకు మిగులుతుంది. థియేట్రికల్ రైట్స్ రూపంలో 100 కోట్లు… ఇక డిజిటల్, శాటిలైట్ , హిందీ డబ్బింగ్ రైట్స్, హిందీ శాటిలైట్ రైట్స్ రూపంలో 50 కోట్ల వరకూ అందుతుంది. అందుకే ఈ మధ్య మహేష్ రెమ్యూనరేషన్ కు బదులు ఈ నాన్ థియేట్రికల్స్ రూపంలో వచ్చే మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఎలాగూ అడ్వాన్స్ మినహా మిగిలిన ఖర్చు ఏమి ఉండదు కాబట్టి.. నిర్మాతలు కూడా అందుకు ఓకే చెప్పేస్తున్నట్టు తెలుస్తుంది. మహేష్ సినిమాకి ఓవర్సీస్ లో కూడా 10 కోట్ల పైనే మార్కెట్ ఉంది. అయితే ఇప్పుడు మహేష్ 50 కోట్ల రెమ్యూనరేషన్ కు కరోనా ఎఫెక్ట్ తగిలే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు అమెరికాని కరోనా చిత్ర హింసలు పెడుతుంది. కొన్ని లక్షల కోట్ల నష్టం ఉంటుందని… అక్కడ ఉన్న ఇండియన్స్ ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి పరిస్ధితుల్లో మళ్ళీ అమెరికా ఎప్పుడు కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి. దీంతో మహేష్ కి ఓ రేంజ్ మార్కెట్ ఉన్న ఓవర్సీస్ పరిస్ధితి అలా ఉంటే.. మహేష్ అడిగినంత రెమ్యూనరేషన్ అంటే 50 కోట్లు ఇక మీదట నిర్మాతలు ఇస్తారా అనేది పెద్ద ప్రశ్న. అయితే మహేష్ సినిమా ఇంకా మొదలుకాలేదు.. మొదలయ్యి పూర్తయ్యేసరికి 2021 సమ్మర్ వచ్చేస్తుంది. అప్పటికి పరిస్ధితి చక్కపడుతుందేమో చూడాలి..!
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్